బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయి.. మరి బెండకాయ నీరు తాగితే..?

-

బెండకాయలు బాగా తింటే గణితం బాగా వస్తుందని అంటుంటారు. తెలివితేటలు సంగతి పక్కనబెడితే బెండకాయ కూర అంటే ఇష్టం ఉండని వారుండదు. ఎలాంటి సీజన్‌లో అయినా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. అయితే.. బెండకాయ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బహుశా ఎవరికీ తెలిసుండకపోవచ్చు. బెండకాయ నీరు ఎలా వస్తుంది? ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం.

మార్కెట్లో విచ్చలవిడిగా కూరగాయల్లో బెండకాయ ఒకటి. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు చాలామంది. ముఖ్యంగా బెండకాయ ఫ్రై వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు.  విషయం ఏంటంటే.. బెండకాయల్ని ఎలా తిన్నా కొన్ని పోషకాలు అందుతాయి. అందులో ఉండే పూర్తి పోషకాలు అందాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి.

చిన్న బెండకాయలు 2 లేదా 3 తీసుకొని బాగా కడుగాలి. వాటి మొదలు, చివర్లు తీసేయాలి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని ఉంచితే అవి బాగా నానుతాయి. వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఉదయాన్నే నీటిలోని బెండముక్కల్ని తీనేసి నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.

  •  ఈ బెండకాయ నీరు.. పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. ACDT, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
  • బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.
  • గుండె పదిలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బెండకాయల్ని నానబెట్టిన నీరు ఎంతో మేలు చేస్తుంది.
  • టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే బెండకాయ వాటర్ తాగాలి.
  • కంటిచూపు సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్, హెయిర్‌కి కూడా ఈ నీరు ప్రయోజనాలు కలిగిస్తుంది.
  • అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి దీనికి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news