హైదరాబాద్ అలిగింది.. రోజు తనతో తిరిగే అన్నదమ్ముళ్ళు కానొస్తలేరని.. నిశ్శబ్ధంగా ఒంటరిగా అలా చూస్తూ ఉంది.. అక్కచెల్లెండ్లు వస్తరేమోనని.. బిడ్డలంతా ఎట్లుంటున్నరోఅని దిగాలు పడుతోంది..
కండ్లు కాయలు కాయంగా ఎదురు చూస్తుంది ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు వోతదాఅని.. అలిగిన వేళనే చూడాలి అన్నట్లుగా హైదరాబాద్ అందాలు కండ్లకు కనువిందు చేస్తుంది..
ఏమ్రా బై ఇంట్ల కూసోమంటే హైదరాబాద్ తిరిగొచ్చినావని తిట్టకుర్రి.. మన హైదరాబాద్ పోరగాండ్లు హైదరాబాద్ అందాలను కెమెరాల పట్టి సోషల్ మీడియాల పెట్టిర్రు.. అబ్బ అబ్బ సూస్తుంటే ఎసుంటోనికైనా ఒక్కసారి పోయి సూడాలనిపిస్తది.. ఆ తప్పు మనం జెయ్యోద్దు గని,, గీ వీడియోల సూసి ఎంజాయ్ చేద్దాం.. మళ్ళ మళ్ళ సూడుర్రి గని బైయటకైతే పోవద్దు.. మన కోసం మహానగరం ఇంకా సుందరంగా ఎదరు చూస్తుంటది.. అప్పడ్దాక పైలం..
అస్సల్ విషయం మర్శిన.. గీ వీడియో తీసినోళ్ళ గురించి చెప్పలే.. దూలం సత్యనారాయణ డీఎస్ఎన్ ఫిలిమ్స్ వోళ్ళు మస్త్ షూట్ చేసిర్రు.. ఈళ్ళ టీమ్‌కి అభినందనలు… మంచి మంచి వీడియోలు ఇంకా శానా జెయ్యాలే..
గమనిక.. దీని టైటిల్ “సుందర.. మణిమయ.. మహా సౌభాగ్యనగరం.!”.. ఫేస్‌బుక్‌ల దాయి శ్రీశైలం వాల్ మీది కెళ్ళి తీసుకున్న..
-RK