నేరేడు ఔషదాలనిధి.. పండంతా పరమ ఔషదమే!

-

నిగనిగలాడుతూ.. నోరూరించే నేరేడు పండు ప్రతిరోజూ తినడం వలన ఆరోగ్యానికి మంచిది. నేరేడు పండ్లలో క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, విటమిన్‌–సి; విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్‌–బి6 వంటి వాటితోపాటు కెరటిన్, ఫోలిక్‌యాసిడ్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇక వంద గ్రాముల నేరేడు పండ్లలో 0.6 గ్రాముల పీచు ఉంటుంది. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazing Health Benefits of Jamun Fruite
∙నేరేడు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడమే కాదు, డయాబెటిస్‌ లక్షణాలైన అతిమూత్రం, బాగా దాహంగా అనిపించడం వంటి లక్షణాలను సమర్థంగా తగ్గిస్తుంది.
∙నేరేడు పండ్లు అనేక రకాల నోటి సమస్యలనూ తగ్గిస్తాయి. దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిలో వచ్చే కురుపులు, పుండ్లను నయం చేస్తాయి.
∙నేరేడులో పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. వందగ్రాముల నేరేడులో 55 మి.గ్రా. పొటాషియమ్‌ ఉండటం వల్ల ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండెజబ్బులనూ, గుండెపోటును కూడా నివారిస్తుంది.
∙ఈ పండ్లలో ఐరన్‌ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను సమర్థంగా నివారిస్తాయి. అనీమియాకు రుచికరమైన ఔషధం నేరేడు.
∙నేరేడులో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. పేగుల్లో వచ్చే అల్సర్‌లను తగ్గిస్తాయి. డయేరియా సమస్యను దూరం చేస్తాయి. మొలలను స్వాభావిక మార్గంలో తగ్గించే గుణం నేరేడులో ఉంది.
∙నేరేడులోని పాలీఫీనాల్‌ వంటి ఫైటోకెమికల్స్‌ క్యాన్సర్లతో పోరాడతాయి. అందుకే నేరేడుతో ఎన్నో రకాల క్యాన్సర్లు నివారితమవుతాయి.
∙ఈ పండ్లు ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తాయి.
∙నేరేడు వికారం, వాంతులు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
∙నేరేడులోని శక్తిమంతమైన పోషకాలు, ఫైటోకెమికల్స్‌ కారణంగా అది రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఎన్నో వ్యాధులను నివారిస్తుంది.
∙ఏజింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది.
∙మహిళల్లోని సంతానలేమి సమస్యను స్వాభావికంగా దూరం చేస్తుంది.
∙అనేక రకాల చర్మవ్యాధులను నిరోధిస్తుంది. ఒంటిపైన వచ్చే గడ్డలు, చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది.
∙ఇందులో క్యాల్షియమ్‌ కూడా ఎక్కువే. కాబట్టి ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలైన రుమాటిక్‌ నొప్పులు, గౌట్‌ సమస్య వల్ల కలిగే బాధలు నేరేడు తినడం వల్ల దూరమవుతాయి.
∙స్పీ›్లన్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ను కూడా నేరేడు నివారిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news