డ్రైనట్స్ అధికంగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..? సైంటిఫిక్ గా ఏం చెప్తున్నారు..

-

ఆరోగ్యానికి మంచిదని అందరూ డ్రైనట్స్ తింటుంటారు. అయితే వీటిని నానపెట్టుకుని తినమని ప్రకృతి వైద్యులు ఎప్పుడూ అంటుంటారు. నాచురోపతి ఫాలోవర్స్ అంతా కూడా అలానే చేస్తుంటారు. కానీ ఈ క్రమంలో చాలా అపోహలు వస్తున్నాయి. డ్రైనట్స్ ఎక్కువగా తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తుంటారు. ఇక అందరూ అలా అనేసరికి మనకు కూడా మైండ్ లో ఒక డౌట్ ఉండిపోతుంది. ఎక్కువ తింటే మంచిది కాదేమో అని.. ఈరోజు మనం ఇది ఎంతవరకు వాస్తవం, సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయో చూద్దాం.

వెయిట్ ఎక్కువగా ఉన్నవారు 5-10 బాదం, పిస్తాపప్పులు తినాలి. ఇలా మొత్తం ఏ నట్స్ తీసుకున్నా.. 30-40 గ్రాములు కూడా వెళ్లవు. ఇక సన్నగా ఉన్నవారు, గర్భిణీలు, బాలింతలు, ఆటలు ఆడేవారు, హార్డ్ వర్క్ చేసేవాళ్లు అయితే 20-25 గ్రాముల బాదం, పిస్తా, వాలనట్స్ 20 గ్రాములు, వేరుశనగపప్పులు 50 గ్రాములు అయినా తినొచ్చు. ఇలా అన్నీ కలిపి తిన్నా.. 100- 200గ్రాములు అంతే. 200 గ్రాములు విత్తనాలు తిన్నా ఏం కాదు. మన బాడీకీ సరిపడానే మనం తిన్నట్లు. రోజు 30 గ్రాముల విత్తనాలు తినటం వల్ల ఏం జరుగుతుందని స్వీడన్ లో ఒక పరిశోధన చేశారు.

2017లో నేషనల్ ఫుడ్ ఏజెన్సీ( National Food Agency Sweden) వారు పరిశోధన చేశారు. డైలీ 30 గ్రాములు నట్స్ రోజు తినటం వల్ల సంవత్సరంలో హార్ట్ కేసులు తగ్గాయట. 7000 హార్ట్ కేసులు తగ్గాయని వారు కనుగొన్నారు. అంటే నట్స్ గుండెకు అంత మేలు చేస్తున్నాయనమాట. 30 గ్రాములు తింటేనే అన్ని లాభాలు ఉన్నాయంటే.. మనం 100/ 150/ 200 గ్రామలు తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంతకుమించి ఎవరూ తినలేరు కూడా.

కానీ ఎవరైతే 600-700 గ్రాముల నట్స్ ఒకరోజులో తింటారో.. అంటే 7-8 సంవత్సరాల పాటు ఇలా తినడం వల్ల లివర్ క్యాన్సర్ 10 శాతం వచ్చే అవకాశం ఉందని స్వీడన్ వారే పరిశోధన చేసి ఇచ్చారు. అంటే అన్ని గ్రాముల నట్స్, అన్ని ఏళ్లపాటు తింటే అప్పుడు ప్రాబ్లమ్. మనం తినే. 100-150 గ్రాముల వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

అరకేజి నట్స్ డైలీ తినడం వల్ల ఏం జరుగుతుందంటే.. ఈ నట్స్ పైన ఫంగస్ క్రిములు తయారై.. ఎఫ్లోటాక్సిన్ b1( Aflatoxin B1)అనేది వదులుతుందట. అవి విత్తనాల లోపలికి వెళ్లిపోతుంది. ఇది 30 గ్రాములు నట్స్ తిన్నప్పుడు 2.8 నానో గ్రాములు ఎఫ్లోటాక్సిన్ b1 వెళ్తుంది. అదే 100- 200 గ్రాములు తిన్నామంటే 10- 50 నానో గ్రామ్స్ అయినా బాడీ ఈజీగా క్లియర్ చేయగలదు. ఎప్పుడైతే ఎఫ్లోటాక్సిన్ b1( Aflatoxin B1) అనేది రోజుకు 70 నానో గ్రాములు 6-7 సంవత్సరాల పాటు వెళ్తే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం 10శాతం ఉంటుంది. అసలు ఎవరు తింటారండి రోజుకు అరకేజీ నట్స్.

మన దగ్గర పైసలు ఎక్కువగా ఉన్నా.. అంతంత నట్స్ ఎవరూ తినలేరు. వెగటు కొట్టేస్తుంది. మనం తినే 100 గ్రాములు నట్స్ చూసే.. మీ చుట్టుపక్కల వారు…మీరు అతిగా నట్స్ తినేస్తున్నారు అనుకుంటారు. వాళ్లు అవి కూడా తినరు కదా. అందుకే ఎదుటివారికి మీరు ఎక్కువగా తిన్నట్లు అనిపిస్తుంది. మనం వాళ్ల మాటలు నమ్మి ఏదేదో అనుకుని తినడం మానేస్తాం. డబ్బులకు ఇబ్బంది లేనివాళ్లు హ్యాపీగా కొనుక్కోని రోజుకు 200 గ్రాముల వరకు తినేయొచ్చు.

అయితే నానపెట్టుకుని తిన్నప్పుడే అందులో ప్రోటీన్ తేలిగ్గా డైజెషన్ అవుతుంది. వంటికి బాగా పడతాయి. ఎండువాటిని ఎండుగానే తినడం వల్ల పొట్ట హెవీగా ఉంటుంది. డైజెషన్ స్లో అవుతుంది. ఎక్కువసేపు పొట్టలో నిల్వ ఉండి పులుస్తాయి. దానివల్ల గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి నానపెట్టుకుని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు. అన్నీ లాభాలే.

– Triveni Buksarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version