అన్ని రకాల పోషక పదార్థాలు మనకి అందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది ఏదైనా విటమిన్ లోపం ఉంటే రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఎముకలు దంతాలు కండరాలు ఆరోగ్యంగా ఉండేలా ఇది చూస్తుంది. విటమిన్ డి లోపం ఉంటే పిల్లలు రికెట్స్ వంటి సమస్యలు కలుగుతుంటాయి.
విటమిన్ డి ఎముకల నొప్పులు రాకుండా చూస్తుంది. కండరాల సమస్యలు లేకుండా చూస్తుంది. ఒకవేళ కనుక శరీరంలో విటమిన్ డి తక్కువ ఉంటే బోన్స్ డెన్సిటీ తగ్గుతుంది బోలి ఎముకల సమస్యలు పగుళ్ళు వంటి ఇబ్బందులు కలుగుతాయి. అలానే మధుమేహం, హై బిపి, క్యాన్సర్ వంటి వివిధ రకాల సమస్యలు విటమిన్ డి లేకపోవడం వలన కలుగుతాయి.
తగినంత విటమిన్ డి లేకపోతే ఈ లక్షణాలు కనపడతాయి:
తగినంత నిద్ర లేకపోయినా
అలసట ఉంటున్నా
ఎముకల నొప్పి
డిప్రెషన్
జుట్టు రాలుతున్నా
కండరాల బలహీనత
ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా విటమిన్ డి లేకపోతే కనపడే లక్షణాలు. వీటితో పాటుగా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
ఇలా విటమిన్ డి ని పొందొచ్చు:
వివిధ రకాల చేపల్లో డి విటమిన్ ఉంటుంది.
అలానే రెడ్ మీట్ తో కూడా పొందొచ్చు.
లివర్ ద్వారా కూడా పొందొచ్చు.
గుడ్డు పచ్చసొన లో కూడా విటమిన్ డి ఉంటుంది.
కాసేపు ఎండలో వున్నా కూడా విటమిన్ డి ని పొందొచ్చు.
ఫోర్టిఫైడ్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, సెరల్స్ ద్వారా కూడా లభిస్తుంది.