అందమైన చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి…!

మీ చర్మం ఇప్పుడు వున్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు లోకి రావాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని చూడాల్సిందే. ఇలా కనుక ఫాలో అయితే మీరు మరెంత అందంగా ఉంటారు.
మరి ఈ చిట్కాలు పై ఒక లుక్ వేసేయండి మరి.

1. నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం తీసుకోండి. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం నిగనిగలాడుతుంది.

2 . పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా బ్లెండ్ చెయ్యండి. ఆ తర్వాత ఆ రసాన్ని చర్మానికి అప్లై చెయ్యండి. ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేసుకోవాలి. అంతే మీ చర్మం నిగనిగలాడుతుంది. ఇలా వారానికి ఒక సారి అనుసరించండి.

3. నిగనిగలాడే చర్మం కోసం టమాటా రసం తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి చర్మానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. ఈ ప్రాసెస్ ని మీకు టైం ఉన్నప్పుడు రిపీట్ చెయ్యండి. ఇక మీ చర్మము మెరుస్తూ ఉంటుంది.

4. మెడ, మోచేతులు నల్లగా ఉంటే తెల్లగా మార్చడానికి ఒక టేబుల్ స్పూన్ పెసర పిండి,రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు చుక్కల నిమ్మ రసం కలిపి మెడ మీద, మోచేతి పైన అప్లై చెయ్యండి. ఆ తర్వాత పదిహేను నిమిషాలు పోయాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయ్యారంటే మేలైన నిగారింపుని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఫాలో అయిపోండి.