మన వంటింట్లో వుండే ఈ పదార్ధాలతో డార్క్ సర్కిల్స్ ని తొలగించచ్చు..!

-

ముఖంపై డార్క్ సర్కిల్స్ ఉంటే అందం మరికాస్త తగ్గిపోతుంది. మీరు డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటే కచ్చితంగా ఈ చిట్కాలని మీరు ఫాలో అవ్వండి. ఇలా కనుక ఫాలో అయ్యారు అంటే తప్పకుండా డార్క్ సర్కిల్స్ ను తొలగించుకోవచ్చు. పైగా దీని కోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. కేవలం మీ ఇంట్లో ఉండే పదార్థాలతో డార్క్ సర్కిల్స్ ని మాయం చేసేయచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.

 

Dark circles

 

గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండటం:

ఈ మధ్య కాలంలో చాలా మంది గ్యాడ్జెట్స్ కి బాగా అలవాటు పడిపోయారు. దీని వల్ల డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. అయితే మీరు గ్యాడ్జెట్స్ తో సమయాన్ని గడుపుతుంటే.. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల కంటికి ఇబ్బంది ఉండదు. అలానే డార్క్ సర్కిల్స్ కూడా ఉండవు.

బాగా రాత్రి అయిన తర్వాత నిద్ర పోవడం:

చాలామంది వీళ్ళకి నిద్రపోరు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి కాబట్టి సరిగ్గా వేళకి నిద్రపోండి.

ఆల్కహాల్ తీసుకోవడం :

ఆల్కహాల్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి కాబట్టి ఆల్కహాల్ కి దూరంగా ఉండండి.

పాలు:

ఇవి తగ్గాలంటే కొద్దిగా పాలలో బాదం పప్పు వేసి మెత్తని పేస్ట్ చేసుకుని డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ నుండి ఈజీగా బయటపడచ్చు.

కీరదోస:

కీర దోసని చక్రాల కింద కోసి డార్క్ సర్కిల్స్ మీద పెట్టడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

టమాటా జ్యూస్:

టమాటా జ్యూస్ చేసుకుని మీరు డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news