పవన్ కళ్యాణ్ ఇచ్చే డబ్బులు నాకు వద్దు : కిన్నెర మొగులయ్య

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమా భీమ్లా నాయక్ లో పాట‌కు కిన్నెర తో స్వ‌రాలు అందించిన కిన్నెర మొగుల‌య్య‌కు ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కిన్నెర క‌ళ అనేది అరుదైన క‌ళ అని మొగుల‌య్య లాంటి క‌ళాకారుల‌ను కాపాడాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.2ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. అయితే తాజాగా తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇస్తున్న డబ్బును తీసుకోన‌ని కిన్నెర మొగుల‌య్య వ్యాఖ్యానించారు.

Kinnera Mogulaiah:

తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఒక‌సారి క‌లిసాన‌ని మ‌రోసారి అంత‌గొప్ప వ్య‌క్తిని క‌ల‌వాల‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిసిన త‌ర‌వాతే ఆ డ‌బ్బులు తీసుకుంటా అని కిన్నెర మొగుల‌య్య ప‌ట్టు బ‌ట్టారు. ఇప్ప‌టికే త‌న కు డ‌బ్బులు పంపించారని..డబ్బు తీసుకోవాలంటూ త‌న‌కు ఫోన్ లు వ‌స్తున్నాయ‌ని మొగుల‌య్య చెప్పారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మాట్లాడి ఆయ‌న ఎంత ఇస్తే అంత తీసుకుంటానని మొగుల‌య్య అన్నారు.