చర్మం పొడిబారుతోందా…? అయితే ఇది మీకోసం…!

-

చలికాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం. శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించదు. వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం,చర్మానికి తేమ ఉండేటట్టు చూసుకోవడం. పొడి చర్మం నుండి విముక్తి పొందడానికి మాయిశ్చరైజింగ్ ఎంతో అవసరం. ప్రతి రోజు తప్పకుండా ముఖానికి , చేతులకు మాయిశ్చరైజర్ తో మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అప్పుడే శరీరంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే బయటకు వెళ్లే సమయంలో మాయిశ్చరైజర్ ఉండే సన్ స్క్రీన్ మాత్రమే వాడాలి దాంతో చర్మం పొడి బారదు.

అరటిపండు పాలు :

చర్మం పొడిగా అయినప్పుడు అరటిపండు గుజ్జు మరియు పాలు కలిపి పొడి చర్మం పై రాసుకోవాలి. అరటిపండు గుజ్జు వల్ల చర్మం ఎంతో మృదువుగా మారుతుంది , పాలు వల్ల చర్మం మెరుస్తూ కనబడుతుంది. ఈ మిశ్రమాన్ని రాసుకున్న 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

తేనే, పాల మీగడ :

ప్రతి మాయిశ్చరైజర్ లో పాల మీగడ ఒక పదార్థం. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది
మరియు తేనె ముఖం పై ఉండే బ్యాక్టీరియాను, దుమ్మును పోగొడుతుంది. దాంతో మొటిమలు కూడా పెరగవు. ఒక టేబుల్ స్పూన్ పాల మీగడలో తేనెను కలిపి ముఖం, చర్మం పై రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారి మృతకణాలను పోగొడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news