చర్మ సమస్యలను తొలగించుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి..!

-

ముఖం పై మొటిమలు, టోన్ మారిపోవడం ఇటువంటివన్నీ చాలా సాధారణం. ఈ చిట్కాలను కనుక మీరు అనుసరించారు అంటే మేలైన నిగారింపు మీ సొంతం. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తి చేయండి..

- Advertisement -

పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:

పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల మీ చర్మం క్లీన్ గా ఉంటుంది. పైగా జిడ్డు చర్మం వాళ్ళు ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుగా పుదీనా ఆకుల్ని గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె మరియు పెరుగును దానిలో కలిపి.. మీ ముఖంపై అప్లై చేయండి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళ తో ముఖాన్ని కడిగేసుకోండి. దీని వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు పూడుకు పోతాయి. ఆయిల్ స్కిన్ వాళ్లకి మరెంత బెనిఫిట్ ఉంటుంది.

పుదీనా పసుపు ఫేస్ ప్యాక్ :

పసుపు వలన ఎన్నో బెనిఫిట్ మనకి కలుగుతాయి. దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల పసుపుని మనం ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే పింపుల్స్ తగ్గిపోతాయి మరియు యాక్నీ కూడా తొలగిపోతుంది. దీనికోసం ముందుగా కొన్ని పుదీనా ఆకుల్ని మీరు గ్రైండ్ చేయండి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు దానిలో వేసి కలపండి. మీ ముఖం పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీని వల్ల మీకు పింపుల్స్ తగ్గిపోతాయి మరియు యాక్నీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ పద్ధతిని నెలకి రెండు మూడు సార్లు అనుసరించినా మీకు సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి.

పుదీనా, కీరదోస ఫేస్ ప్యాక్:

కీరా దోస వేసవి లో ఎంతో మేలు కలిగిస్తుంది. దీనిలో శక్తివంతమైన కూలింగ్ మరియు హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. పుదీనా ఆకుల్లో కొద్దిగా కీరదోస ముక్కలు, తేనే వేసి మెత్తగా పేస్ట్ చేయండి దీనిని మీ ముఖంపై అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీని వల్ల మీకు చర్మం పై మంట తగ్గుతుంది మరియు మేలైన నిగారింపు మీ సొంతమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...