టమాట కోసం చనిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. ఆఫ్రికాలోని నైజీరియాలోని ఇబడాన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇబడాన్ మార్కెట్ కి టమాటలని తీసుకెళ్తున్న ఒక వ్యక్తి, టమాట గంపలని రోడ్డు మీద పారేసుకున్నాడు. దాంతో అక్కడున్న వ్యాపారులకి ఇబ్బందిగా మారింది. అంతే ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అది అక్కడితో ఆగకుండా ఉత్తర, దక్షిణంగా విడిపోయి మరీ మత ఘర్షణలకు తావు తీసింది.
ఉత్తరం ముస్లింలు, దక్షిణం క్రిస్టియన్లుగా విడిపోయి కలహాలు పడ్డారు. ఈ కలహంలో మొత్తం 20మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మార్కెట్లలో ఉన్న దుకాణాలకి నిప్పంటించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ దుకాణాలన్నీ మూతబడ్డాయి. ప్రభుత్వం కఠిన నియమాలను ఆదేశించింది. మొత్తానికి టమాట కోసం ఇంత రచ్చ జరగడం ఆశ్చర్యమే.