ఈ ఇంటి చిట్కాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

-

ఆడవాళ్ళు అందానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ముఖాన్ని అందంగా మార్చుకోవాలని, మంచి గ్లో పొందాలని అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కాలుష్యం వల్ల సూర్య కిరణాలు మొదలైన వాటి వల్ల ముఖంపై కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అందంగా మారాలంటే ఇంటి చిట్కాలు పాటించండి. దీనితో మీ ముఖం మెరుస్తూ ఉంటుంది.

ఆలివ్ ఆయిల్:

రాత్రి నిద్రపోయేటప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని మీకు నచ్చిన క్రీము లో దానిని వేసి మసాజ్ చేయండి. డైరెక్ట్ గా ముఖం మీద ఆలివ్ ఆయిల్ అప్లై చేయొద్దు. క్రీమ్ కలిపి మాత్రమే అప్లై చేయండి. ఆలా వదిలేసి ఉదయాన్నే ముఖం కడుక్కోండి. దీనితో మీకు మంచి నిగారింపు వస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె కూడా ముఖానికి మంచి గ్లో ఇస్తుంది. మీకు నచ్చిన క్రీమ్ లో కొబ్బరి నూనె కలిపి మీ ముఖం మీద మసాజ్ చేయండి. రాత్రి అంత అలా వదిలేసి ఉదయాన్నే ముఖాన్ని కడుక్కోండి. స్కిన్ ఇరిటేషన్ లాంటివి కూడా తొలగిపోతాయి.

కీర జ్యూస్:

కీరా కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం లో వాటర్ లెవెల్స్ ని ఇది పెంచుతుంది. ఇరిటేషన్ ని కూడా తగ్గిస్తుంది. కొద్దిగా కీరా తీసుకొని ముఖం మీద అప్లై చేసుకుని ఉదయాన్నే దానిని కడిగేసుకోండి.

పసుపు పాలు:

కొద్దిగా పచ్చిపాలు తీసుకుని దానిలో పసుపు మిక్స్ చేసి.. రాత్రి నిద్ర పోయేటప్పుడు దానిని మీ ముఖం మీద అప్లై చేయండి. ఉదయం వరకు అలానే వదిలేసి ఉదయాన్నే నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి. పింపుల్స్ కూడా దీనివల్ల పోతాయి ఇలా ఈ చిట్కాలు పాటిస్తే మేలైన నిగారింపు మీ సొంతం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news