చాలామంది స్నానం చేయటం వల్ల మన శరీరం మాత్రమే రిఫ్రెష్ అవుతుందనుకుంటారు..నిజానికి స్నానం చేయటం అనేది ఫిట్‌నెస్‌లో ఒక భాగం. ఒకసారి స్నానం చేస్తే 5 కేలరీల ఖర్చు అవుతాయట. అయితే కొందరు నార్మల్ బాత్ చేస్తుంటారు. మరికొందరు టబ్‌లో హాయిగా..ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు. ఇంకొందరు స్టీమ్ బాత్ చేస్తారు. వీటన్నింటిలో..స్టీమ్ బాత్ చేయటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆవిరి స్నానానికి ఆయుర్వేదంతో పాటు వైద్యశాస్త్రంలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా.. చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇంకా దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
రక్తపోటును తగ్గిస్తుంది..
ఆవిరి స్నానం చేసే వ్యక్తుల శరీరం నుంచి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది..ఈ స్నానం చేస్తే మీ రక్త ప్రసరణ ఎల్లప్పుడూ చక్కగా ఉంటుంది. దీంతోపాటు అనేక రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో..ఆవిరి స్నానాలు కండరాలు, కీళ్లలో దృఢత్వం నుంచి ఉపశమనాన్ని అందించటంలో ఉపయోగపడుతుంది.
చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది..
హృద్రోగులకు స్టీమ్ బాత్ చాలాబాగా పనిచేస్తుంది. స్టీమ్ బాత్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.. మీరు ప్రతిరోజూ స్టీమ్ బాత్ చేస్తే.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు చర్మాన్ని కాంతి వంతంగా మార్చుకోవచ్చు. వేసవి కాలంలో చెమటలు పట్టడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆవిరి స్నానం చేస్తే శరీరంలోని మురికి తొలగిపోవడంతో పాటు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
బరువు తగ్గటానికి మనం ఏవేవో చేస్తుంటాం..ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. మీరు సరైన మార్గంలో స్టీమ్ బాత్ తీసుకుంటే.. అది కేలరీలను బర్న్ చేస్తుంది.ఆవిరి స్నానం మీ రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
స్టీమ్ బాత్ మనస్సును ఉల్లాసపరుస్తుంది. దీనితో పాటు, ఇది శరీరం నుంచి అలసట, నిద్రలేమి సమస్యలను కూడా తొలగిస్తుందట..ఆవిరి స్నానం చలి నుంచి మనల్ని సురక్షితంగా కాపాడతుంది. స్టీమ్ బాత్ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి స్టీమ్ బాత్ వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా వేడిగా మారుతుంది. దీని కారణంగా…వేడి శ్వాసను కూడా తీసుకుంటాము. వేడి శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లడం ద్వారా కఫాన్ని బయటకు తీయడంలో సహాయపడుతుంది.అంతే కాదు ఆవిరి స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. నిపుణులు సాధ్యమైతే స్టీమ్ బాత్ బెస్ట్ అంటూ సూచిస్తున్నారు.