చాలామంది వేళ్ళకి ఉంగరాలని పెట్టుకుంటారు. ఉంగరాలని పెట్టుకునేటప్పుడు వెండి ఉంగరాలు, బంగారు ఉంగరాలు ఇలా ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. అయితే కొంతమంది రాగి ఉంగరాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. రాగి ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిదా లేదంటే చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కూడా రాగి ఉంగరాన్ని పెట్టుకుంటున్నట్లయితే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. రాగి ఉంగరాలని రాగి ఆభరణాలని వేసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
కొంతమంది రాగి ఆభరణాలని చేయించుకుని మరీ వేసుకుంటూ ఉంటారు. రాగి కడిగాలని రాగి ఉంగరాలని పెట్టుకుంటుంటారు. అలానే రాగి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ మెటల్ చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, చర్మానికి ఎలాంటి హాని కూడా చేయదు. రాగి ని స్పిరిట్ మైండ్ బ్యాలెన్సింగ్ ఎలిమెంట్ అని కూడా అంటుంటారు. కాబట్టి కొంత కాలం పాటు రాగి ని ధరిస్తే ఆరోగ్యం బాగుంటుంది.
శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి రాగి ఉంగరం సహాయపడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వలన కీళ్ల నొప్పులు, కడుపునొప్పి, ఉదర సంబంధిత సమస్యలు వంటివి మీ దరి చేరవు మంచి ఉపశమనం లభిస్తుంది. ఆథరైటిస్ తో బాధపడే వాళ్ళు రాగి ఉంగరాన్ని రాగి కడియాన్ని వేసుకుంటే మంచిది. రాగి ఉంగరాన్ని ధరించడం వలన రక్తం శుభ్రంగా ఉంటుంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా రాగి ఉంగరం ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు ఉన్నవాళ్లు కూడా రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది.