లోబీపీతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆయుర్వేద టిప్స్ ని పాటించండి..!

చాలా మంది లోబీపీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. లోబీపీ సమస్య ఉంటే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. లోబీపీ సమస్యతో బాధపడే వాళ్లకు ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

 

లోబీపీ సమస్య ఉన్న వాళ్ళల్లో బ్రెయిన్, ఊపిరితిత్తులు, కిడ్నీ మొదలైన శరీర భాగాలకు బ్లడ్ సరిగ్గా అందదు. దీంతో బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లోబీపీ సమస్య ఉంటే అంత తేలికగా వదిలేయడం మంచిది కాదు. లోబీపీ తో బాధపడే వాళ్ళు ఈ ఆయుర్వేద చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

లోబీపీతో బాధపడేవాళ్ళు అల్లం ముక్కలు కింద చేసుకుని అందులో నిమ్మరసం వేసుకుని కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఒక జార్లో పెట్టుకుని రోజుకి మూడు నుండి నాలుగు సార్లు తీసుకుంటే మంచిది. దీంతో కొద్ది రోజులకి లోబీపీ కంట్రోల్ అవుతుంది.
లేదు అంటే నల్ల ఉప్పుని, నల్ల మిరియాలని, టమాటా రసంలో వేసుకుని తీసుకుంటే కూడా లోబీపీ సమస్య నుంచి బయటపడవచ్చు.
లోబీపీ తో బాధపడే వాళ్లకు బీట్రూట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ జ్యూస్ ని ఉదయం సాయంత్రం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
పాలల్లో ఖర్జూరం వేసి మరిగించి దానిని తీసుకుంటే కూడా లోబిపి నుండి బయట పడవచ్చు ఇలా జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యకు చెక్ పెట్టండి. దానితో ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.