వ్యాయామం చేయడానికి సమయం లేదా? అయితే ఇలా చేయండి..!

-

ఈ మధ్యకాలంలో శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సరైన జీవన విధానం లేకపోవడం వలన అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పైగా, వ్యాయామం చేయడానికి సమయం లేకపోవడం వలన అశ్రద్ధ చేయడం సహజమైపోయింది అని చెప్పవచ్చు. అయితే, సమయం లేని సందర్భంలో వ్యాయామాలకు బదులుగా మెట్లు ఎక్కడం వంటివి ప్రయత్నించండి. వీటి వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. పైగా, ఎటువంటి పరికరాలు లేకుండా ఫిట్నెస్ ను పొందవచ్చు. లిఫ్ట్ మరియు ఎస్కలేటర్ కు బదులుగా మెట్లను ఉపయోగించి నడవడం వలన బరువు తగ్గించుకోవచ్చు మరియు ఫిట్ గా ఉండవచ్చు.

శరీరానికి మాత్రమే కాకుండా మెట్లు ఎక్కడం వలన మనసుకు కూడా ఎంతో సహాయపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. పైగా సీనియర్ సిటిజన్ లు కూడా దీనిని ప్రయత్నించవచ్చు. మెట్లు ఎక్కడం వలన సీనియర్ సిటిజన్స్ శరీరం బలంగా మారుతుంది మరియు పడిపోయే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మెట్లు ఎక్కుతారో, జ్ఞాపక శక్తి మరియు సృజనాత్మకత ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు గుండె ఆరోగ్యం మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.

చాలా మంది ఫిట్నెస్ కోసం జిమ్ కు వెళ్తూ ఉంటారు మరియు జిమ్ లో ఉండే స్టెప్ మెషిన్లను కూడా ఉపయోగిస్తారు. దానికి బదులుగా ఇంట్లో ఉండే మెట్లను ఎక్కడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది. కనుక ఎటువంటి పరికరాలు లేకుండా ఇంట్లో మెట్లను ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. మెట్లు ఎక్కడం వలన కేలరీలు బర్న్ అవుతాయి మరియు జిమ్ లో వర్కౌట్ చేయడానికి సమయాన్ని కేటాయించాల్సిన పనిలేదు. అంతేకాక నడవడం తో పోలిస్తే మెట్లు ఎక్కడం వలన హృదయ స్పందన రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అవుతుంది మరియు కండరాలు బలంగా మారడానికి కూడా సహాయం చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news