మినుముల తో అనేక వంటలని, పిండి వంటలని కూడా చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినుమల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అలానే ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం చాల మంచిది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కలగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఎముకలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా వీటిని తీసుకుంటే మీ దరి చేరవు. మినుముల్లో ఉండే సూక్ష్మ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగు పరుస్తాయి.
అలానే మినుములు లో రెండు రకాల ఫైబర్ కలిగి ఉంటుంది. కరగని ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. మినుముల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కడుపు లో మంట, నొప్పులను కూడా తగ్గిస్తాయి. వీటిని ముద్దగా చేసి నొప్పి ఉండే కండరాలు, కీళ్ల పై మర్దన చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది.
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర, గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. మినుములని తీసుకుంటే రక్తం లో చక్కెర స్థాయులు పెరగకుండా చూడొచ్చు. మినుముల నుంచి పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. రక్త నాళాలు, ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించడానికి కూడా మినుములు ఉపయోగ పడతాయి.