సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఎం ఎం టీ ఎస్ రెండో దశ పనులకు నిధులు కేటాయించాలని కేసీఆర్ ను కిషన్ రెడ్డి లేఖలో కోరారు. ఎం ఎం టీ ఎస్ రెండో దశకు ఇవ్వాల్సిన దాని కంటే ఇప్పటికే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటం వలనే పనలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప పనులు సాగే అవకాశం లేదని ఆయన అన్నారు. పనులు ఆగి పోవటం వలన ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆయన అన్నారు. ఎం ఎం టీ ఎస్ ను యాదాద్రి వరకు నడపటానికి కేంద్రం 2016-17లోనే అనుమతినిచ్చిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం 75కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి వరకు ఎం ఎం టీ ఎస్ ను పొడిగించటానికి సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.