గులాబీలో ఔషధ గుణాలెక్కువ..!

Join Our Community
follow manalokam on social media

గులాబీ పూలను ఇష్టపడని వారుండరూ. ప్రియుడు తన ప్రేమను వ్యక్తపరిచేందుకు సాధారణంగా గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేస్తాడు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ గులాబీ పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయనే చెప్పుకోవచ్చు. అందంగా కనిపించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. గులాబీ రేకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎంటో తెలుసుకుందాం రండి.

మొటిమలు, నల్లమచ్చలు మటు మాయం..
యువతీయువకులు యుక్త వయసులో వచ్చినప్పుడు మొఖంపై మొటిమలు, శరీరంపై నల్ల మచ్చలు వస్తాయి. అయితే వీటిని పొగొట్టడానికి గులాబీ రేకులు ఎంతో తోడ్పడతాయి. దీనికి మనం చేయాల్సింది. గులాబీ రేకులను తీసుకోవాలి. వాటిని వేడినీటి కొద్ది సేపు మరిగించాలి. తర్వాత బయటకు తీసి ముద్దగా నూరాలి. ఈ మిశ్రమంలో ముల్తానీ మట్టి కలిపి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వారంలో ఒకసారి నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో, మెటిమలపై రాసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో రోజా రేకులు ఎంతో దోహదపడుతాయి. ఈ మిశ్రమాన్ని వాడుతున్నప్పుడు మీకే ఫలితం కనిపిస్తుంది.

వీర్య కణాల వృద్ధి..
రోజా రేకులు తినడం వల్ల వీర్య కణాల వృద్ధి పెరుగుతుందని, శృంగార జీవితం హాయిగా సాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకి గుప్పెడు రోజా రేకులు తింటూ వస్తే శరీరంలో తలెత్తే రుగ్మతలను పోగొడతాయని, తద్వారా రక్తశుద్ధి జరుగుతుందన్నారు. రోజా రేకులకు సహజంగానే వీర్య కణాలను వృద్ధి చేసే లక్షణం ఉంటుంది.

కషాయం తయారీ..
రోజా రేకులతో కషాయం కూడా తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సహజంగా మార్కెట్ లో లభించే జౌషధాల కంటే ఈ కషాయం ఎంతో మెరుగ్గా పని చేస్తుంది. చర్మానికి కావాల్సిన మెరుపును అందించేందుకు తోడ్పడుతుంది. మొటిమలను తగ్గించి శరీర కాంతిని పెంచుతుంది. రోజా రేకులను కొంచెం సేపు వేడి నీటిలో మరిగించి ఆ మిశ్రమాన్ని శరీరంపై పూసుకుంటే చాలు.

ఒత్తిడిని తగ్గిస్తాయి..
రోజా పూల నుంచి వెలువడే సువాసనను ఆస్వాదించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శారీరకంగా ఒత్తిడికి గురైనప్పుడు ఉపశమనం పొందడానికి ఇదెంతో దోహదపడుతుంది. రోజా రేకులను వేడి నీటిలో మరిగించాలి. అందులో కొంచెం బాత్ సాల్ట్ ని కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఆవిరి పీల్చాలి. అలా చేస్తే ఎంతో ఉపశమనం చేకూరుతుంది.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...