బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!

-

ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం. ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము [బ్రెస్ట్] క్యాన్సర్లు. ఇవి రెండు మహిళలను ఆందోళనలని పెంచుతున్నాయి. అయితే వీటి మీద సరైన అవగాహన లేక పోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా ఈ క్యాన్సర్లకీ మహిళలు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మద్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ఎక్కువ మంది మరణిస్తున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు: రొమ్ముల్లో గడ్డలు మరియు రొమ్ములు గట్టిగా మారడం వంటివి తొలి లక్షణాలుగా గుర్తించవచ్చు. సాధారణంగా రొమ్ముల్లోను, చంకల్లోను నొప్పిగా ఉంటే అనుమానించాల్సిందే. రొమ్ముల్లో మార్పులు, చర్మం లో మార్పులు, ఆ ప్రాంతంలో చర్మం పొరలుగా ఊడటం, రాషేస్ రావడం వంటి లక్షణాలను చూడవచ్చు. బ్రెస్ట్ యొక్క చర్మం రంగు మారడం, అక్కడ నుండి ద్రవాలు కారడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి వయసుతో సంబందం లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. అయితే ఇలా రావడానికి హార్మోన్ల అసమతుల్యత, జీవన సరళిలో వచ్చే మార్పులు, వాతావరణ ప్రభావం కూడా కారణం కావొచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్ని నివారించవచ్చు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి. మీ రొమ్ములను మీరే తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా అధిక బరువు తో బాధ పడేవారు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అలాగే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పు ధాన్యాలు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news