రామలక్ష్మి అంతటి క్రేజ్ రష్మిక కి వస్తుందా .. సుకుమార్ ఇస్తాడా ..?

-

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సమంత అక్కినేని జంటగా నటించిన సినిమా రంగస్థలం. విలేజ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఆర్య, ఆర్య 2, వన్ నేనొక్కడికే, నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ ఫస్ట్ టైం రంగస్థలం లాంటి కల్ట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించి అందరికీ షాకిచ్చాడు. ఈ సినిమా రాం చరణ్ కెరీర్ లోనే బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా చిట్టిబాబు గా చరణ్ రామలక్ష్మి గా సమంత లకి అద్భుతమైన పేరు వచ్చింది. ఈ రెండు పాత్రలని మలచిన తీరుకు సుకుమార్ కి విపరీతమైన ప్రశంసలు దక్కాయి.

 

అయితే సుకుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రంగస్థలం వంటి మాస్ కథనే తెరకెక్కిస్తున్నాడు. అల వైకుంఠపురములో వంటి క్లాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్ పక్కా మాస్ పాత్రని పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా కి పుష్ప అన్న టిటిల్ ని ఫిక్స్ చేసి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ పుష్ప సినిమాని రంగ స్థలం రేంజ్ లోనే ఊహించుకుంటున్నారు. ఇప్పటి సుకుమార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కూడా క్లాస్ గా ఉండటమే కాదు అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న ఇమేజ్ ని తెచ్చాయి.

ఒకరకంగా అల్లు అర్జున్ ఈ సినిమా చేయడానికి రంగస్థలం ప్రభావమే అని చెప్పాలి. ఇక పుష్ప పాన్ ఇండియా రేంజ్ సినిమా అని కూడా రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సుకుమార్ టీం అఫీషియల్ గా వెల్లడించారు. అయితే ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటుంది రష్మిక మందన్న గురించే. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో నటించిన సమంత కి ఎంతగా పేరొచ్చిందో అందరీకీ తెలిసందే. అయితే ఇప్పుడు పుష్ప సినిమాకి అంతటి పేరు రష్మిక కి వస్తుమా అన్న టాక్ మొదలైంది. సుకుమార్ ఆ రేంజ్ లో రష్మిక పాత్ర డిజైన్ చేశారా అని మాట్లాడుకుంటున్నారట. ఒకవేళ నిజంగా రామలక్ష్మి గా సమంత కి వచ్చినంత క్రేజ్ గనక రష్మిక కి వస్తే ఇక దశ తిరిగినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news