వంకాయతో ఇన్ని ప్రయోజనాలా!

-

‘ఆహా ఏమి రుచి తినరా మైమరచి.. ’అంటూ పద్యాల్లో, సినిమాల్లో దేని గురించి పాడారో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా? సా«ధారణంగా కూరగాయల్లో రారాజు అయిన వంకాయ ను ఇష్టపడని వారు చాలా అరుదు. అటువంటి వంకాయ మనకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.వంకాయని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక పోషకాలు సమకూరుతాయంట. అంతేకాదు ఇది మీ ఇంటి దగ్గర్లో పెంచుకోవడం వల్ల మీ పరిసరాలను ఇన్ఫెక్షన్‌ ఫ్రీగా పని చేస్తుందట. అంటే దాని ఆకులు, వేర్లు కూడా ఒక ఔషదంగా పనిచేస్తుందన్న మాట. బ్రింజాల్‌లో అధిక శాతం ఫైటో న్యూట్రియంట్, పొటాషియం మన మెదడుకు ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుంది.


ఎన్నెన్నో ప్రయోజనాలు

  • వంకాయ మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
  • బ్రింజాల్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు. నరాల వ్యవస్థను స్టిమ్యులేట్‌ చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
  • అలాగే దీంట్టో కేన్సర్‌ ను నిరోధించే అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. కేన్సర్‌ కణాలను వృద్ధి చెందకుండా అడ్డుపడతాయి.
  • వంకాయ తొడిమలో సోలసొడైన్‌ రహ్మో్నసిల్‌ గ్లైకోసైడ్‌లు క్యాన్సర్‌ కణాలను రూపుమాపుతాయి. అందుకే దీన్ని తొడిమలతో సహా తీసుకోవడం మంచిది.
  • ఇందులో నీటి శాతంతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉండటం వల్ల పేగు వ్యవస్థలోని అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మొత్తంగా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • బ్రింజాల్‌ ఉండే అంతోసియానిన్‌ అనే పిగ్మెంట్‌ వల్ల గుండె పనితనం మెరుగవుతుంది. ఇది చెడు ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి చేసే హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
  • దీంతోపాటు ఎముకలు సామర్థ్యాన్ని పెంచి , ఎముకల్లోని మినరల్‌ సాంద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాక, ఇందులో దొరికే ఐరన్‌
    , కాల్షియం ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
  • వంకాయలో కార్బోహైడ్రేట్‌లు, క్యాలరీలు తక్కువగా ఉండి, వెయిట్‌ లాస్‌ డైట్‌ ప్లాన్‌ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  • వంకాయలో ఐరన్‌ శాతం ఎక్కువ. అలాగే థియామిన్‌ , నియాసిన్‌ , కాపర్, ఫైబర్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ సీ, కే, బీ6, పొటాషియం, మాంగనీస్‌ వంటి న్యూట్రియంట్లు కూడా అధికంగా ఉంటాయి. అందుకే ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.

.

Read more RELATED
Recommended to you

Latest news