చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది కదా.. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా లేదా అని. ఇంట్లో వాళ్లు అంటారు.. జ్వరంగా ఉంది స్నానం చేస్తే..ఇంకా పెరుగుతుంది.. కేవలం వేడి నీళ్లతో కాళ్లు, చేతులు కడుక్కో చాలు అని. కానీ జ్వరం వస్తే మన దగ్గర ఒక రకమైన వాసన వస్తుంది. మరి ఆ వాసన పోవాలంటే స్నానం చేయాలి. దీనిపై వైద్య నిపుణులు ఏం అంటున్నారు. ఇంతకీ జ్వరం వస్తే స్నానం చేయాలా వద్దా?
వైరల్ ఫీవర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వర్షాకాలం చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే వర్షాకాలంలో దోమలు పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి అనేక వ్యాధులు అందరినీ ఇబ్బంది పెడతాయి. దీంతో చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో నొప్పి కూడా ఉంటుంది. జ్వరం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం మీ జ్వరాన్ని తగ్గిస్తుంది. మీ కండరాలను సడలిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. జ్వరం చాలా ఎక్కువగా ఉంటే, చల్లని నీటితో స్నానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.
స్నానం చేయలేకపోతే ఏం చేయాలి?
కొన్నిసార్లు అధిక జ్వరం వల్ల శరీరంలో మంట వస్తుంది. స్నానం చేయలేం. ఈ సందర్భంలో, చల్లని నీటిలో ముంచిన టవల్‌తో శరీరాన్ని తుడవండి. దీనివల్ల జ్వరాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. తడి టవల్‌తో శరీరాన్ని తుడుచుకోవడం తప్పు కాదు. చాలా మంది తడి టవల్ అయితే ఇంకా జ్వరం పెరుగుతుంది అనుకుంటారు. ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు తడి టవల్‌తో బాడీ అంతా తుడవటం వల్ల ఆ చల్లదనానికి జ్వరం తగ్గుతుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది. కానీ చల్లటి నీటిని ఉపయోగించవద్దు. ఎందుకంటే ఐస్ వాటర్ ఆరోగ్యానికి హానికరం.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వివిధ వ్యాధుల సంభవం వేగంగా పెరుగుతుంది, ఈ వాతావరణంలో ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. జ్వరం వస్తే ఎప్పుడూ వచ్చే రెగ్యులర్ ఫీవర్ అని అసలు లైట్ తీసుకోకండి. మూడు కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలి.