ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తినటమే

-

వింత వింత వ్యాధులు పుట్టుకుస్తున్నాయి.. ఒకటి కాస్త తగ్గిందికదా అనుకుంటే మరొకటి వస్తుంది. సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్‌ బ్రెయిన్‌ డిసీజ్ విన్నారా..దీని గురించే ప్రపంచం అంతా చర్చజరుగుతుంది. ఈ వ్యాధి భారిన పడి అమెరికాలో ప్రతి సంవత్సరం 37.6 లక్షల మంది చనిపోతున్నారట. ఈరోజు ఈ వ్యాధి అంటే ఏంటి, ఎలా వస్తుంది, పరిష్కారాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.‌

సెరెబ్రోవాస్కులర్ డిసీజ్‌ అంటే..

సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, లేదా గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది.. ఫలింతంగా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే.. బ్రెయిన్‌ అబ్నార్మాలిటీస్‌ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరే కొద్ది డిమెన్షియాకు దారితీస్తుంది.

చేపలు తింటే..

డైలీ ఎక్సర్ సైజ్, మంచి పోషకవిలువలు ఉన్న ఆహారం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలో ఈ వ్యాధి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇదొక్కటే కాదు ఈ పద్దతులు పాటిస్తే ఏ వ్యాధి అంత సులభంగా దరిచేరదు కూడా. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి కాబట్టి..ఇది మెదడుకు, సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాల్లో తేలింది.

అధ్యయనాల్లో తేలింది ఏంటంటే..

ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశీలించారు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలిందట.

ఫ్రాన్స్‌లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ రీసెర్చర్‌ డా. సిసిలియా సమీరి ఏం చెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడతాయని కనుక్కున్నారట. అయితే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు.. అంటే చిన్నతనం నుంచే తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు.

కాబట్టి మీలో ఎవరికైనా చేపలు తినే అలవాటు లేకపోతే మీరు తింటూ..మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ముళ్లు ఉంటాయి తీసుకోవటం పెద్ద లొల్లి అన్ని ఫీల్ అవుతుంటారు. కానీ ఒక్కసారి ఆ టేస్ట్ కు అలవాటపడితే ఇష్టంగా తింటారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news