చెరుకు రసంతో లివర్ సమస్యకి చెక్..!

సంవత్సరం పొడవునా మనకి చెరుకు రసం  ( sugarcane Juice ) అందుబాటులో ఉంటుంది. మండు వేసవిలో చెరుకు రసం తాగితే మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది. చెరుకు రసం తాగడం వల్ల చక్కటి పోషక పదార్ధాలు మనకి లభిస్తాయి. చెరుకు రసం వేసవికాలంలో తాగడం వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. అదే మనం చలికాలంలో తాగితే ఒళ్ళు వేడిగా అవుతుంది.

రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాట్ కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. చెరుకు రసంలో ఉప్పు, నిమ్మరసం వేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అదేవిధంగా తక్షణ శక్తి లభిస్తుంది. చెరుకు రసం లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలానే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
పచ్చకామెర్లు, ఎనీమియా, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు చెరుకు రసం తో పోతాయి.

చెరుకు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:

ఎముకలు దృఢంగా ఉంటాయి:

చెరుకు రసం లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

పింపుల్స్ తొలగిస్తుంది:

పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అని బాధ పడే వాళ్ళు చెరుకు రసం తాగడం వల్ల పింపుల్స్ పూర్తిగా తొలగిపోతాయి. అలానే నిగారింపు కూడా పొందొచ్చు.

బరువు తగ్గొచ్చు:

బరువు తగ్గడానికి కూడా చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అలానే బరువుని కూడా అదుపులో ఉంచుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది. కనుక రెగ్యులర్ గా చెరుకు రసం తీసుకుంటూ ఉండండి.

లివర్ సమస్యలు తొలగిస్తుంది:

పచ్చ కామెర్లతో బాధపడేవారు చెరుకు రసం తీసుకుంటే మంచిది. చెరుకు రసం లివర్ కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. లివర్ లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే చెరుకురసం వాటిని తరిమికొడుతుంది. ఇలా చెరుకు రసం తో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.