ఈ వానా కాలంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వానా కాలంలో ఎక్కువగా కండ్ల కలక సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. కండ్ల కలక సమస్య నుండి బయటపడడానికి పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలానే కండ్లకలక వచ్చిన తర్వాత బయటకు వెళ్లడం వలన ఇతరులకు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. కండ్లకలక వచ్చిన తర్వాత ఎంతో బాధపడాలి కానీ రాకుండా చూసుకోవడం మంచిది. ఈ సమస్య రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు అంత బాధపడక్కర్లేదు.
కండ్ల పలక రాకుండా ఉండాలంటే గుడ్లు తీసుకోండి ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి అవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. కంటి ఆరోగ్యానికి బెర్రీస్, క్యాప్సికం కూడా మేలు చేస్తాయి. నారింజని తీసుకుంటే కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి నారింజలో పోషకాలు చక్కగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచే గుణాలు కూడా ఉంటాయి.
కండ్లకలక రాకుండా ఉండాలంటే సల్మాన్, ట్యూనా వంటి చేపల్ని కూడా తీసుకోండి వీటిని తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ గింజల్లో కూడా చక్కటి పోషకాలు ఉంటాయి. విటమిన్ ఈ కూడా వీటిల్లో ఉంటాయి కాబట్టి బాదం, వాల్నట్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉండండి. వెజిటేబుల్ ఆయిల్స్ ని కూడా తీసుకోండి. అలానే నారింజ పండ్లు ఆకుకూరలు కూడా తీసుకోండి. ముఖ్యంగా పాలకూర, పార్స్లీ తీసుకోండి వీటి వలన కండ్ల కలక రాకుండా ఉంటుంది.