డయబెటీస్‌తో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందటున్న శాస్త్రవేత్తలు

-

మధుమేహం సైలెంట్‌ కిల్లర్‌ అని వైద్య నిపుణులు అంటారు. అది వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు.. కానీ మీరు ఇంటికి వచ్చిన చుట్టాలను పట్టించుకోకపోతే వాళ్లకు ఎలా అయితే కోపం వస్తుందో ఇదీ అంతే.. మధుమేహాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లే ఉంటే.. ఇది మెల్లగా బాడీలో ఒక్కో పార్ట్‌ను ఆగం చేయడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా డయబెటీస్‌ ఉన్నవాళ్లకు కళ్లు, కిడ్నీలు దెబ్బతింటాయని మనకు తెలుసు. కానీ గుండె కూడా ప్రమాదంలో పడుతుందని మీరు విన్నారా..?

న్యూరో పతి నుంచి స్ట్రోక్ వరకు, రెటినో పతి నుంచి హార్ట్ ఫెయిల్యూర్ వరకు, జీర్ణ సమస్యల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు ఎలాంటి అనారోగ్యానికైనా డయాబెటిస్ కారణం కావచ్చు. అలాగే గుండె జబ్బుల వంటి ప్రమాదం ఉంటుందని అందరికి తెలిసిందే. ఇలా డయాబెటిస్ తో బాధ పడే వారిలో అన్ డయాగ్నస్డ్ గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం వివరాలు చెబుతోంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న ముగ్గురిలో ఒకరు ఎలాంటి లక్షణాలు లేకుండానే ప్రాణాంతక పరిస్థితుల్లో బతుకుతున్నారని యూఎస్ పరిశోధకులు తెలుసుకున్నారు.

డయాబెటిస్ సమస్య లేని వారితో పోలిస్తే డయాబెటిక్స్ రక్తంలో గుండె ఆరోగ్యానికి చెరుపు చేసే స్పెసిఫిక్ ప్రొటీన్ ఒకటి కనిపించిందట. ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె జబ్బుకు కారణం అవుతుందట. ఎలాంటి గుండె సమస్యలు లేని టైప్ 2 డయాబెటిస్ ఉన్న చాలా మంది వ్యక్తులు గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదంలో ఉన్నారు. అయితే అందరిలో ఇది ఒకేవిధంగా ఉంటుందని చెప్పే వీలు లేదు. ఎవరు ప్రమాదంలో ఉన్నారనేది అన్నింటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం.

ఈ బయోమార్కర్లు ఎలాంటి ప్రమాద సూచికలు లేని వారిలో కూడా కార్డియోవాస్క్యూలార్ ప్రమాదం కలిగించవచ్చట. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం డయాబెటిస్ వల్ల పెరుగుతుందని ఇదివరకు చాలా అధ్యయనాల్లో పేర్కొన్నారు. అయితే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురించిన తాజా అధ్యయనంలో సమస్య అసలు నిర్ధారణ కాని వారిలో ఎలాంటి పరిస్థితి ఉందో పరిశీలించింది. ఏది ఏమైనా డయబెటీస్‌ భారిన పడిన వాళ్లు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధతో ఉండాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉంటే తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version