టాయిలెట్ పేపర్స్ ని వాడడం వలన ఈ సమస్యలు వస్తాయి అని తెలుసా..?

-

టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రైవేట్ పార్ట్స్ ని టిష్యూ పేపర్ తో తుడుచుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే ఎక్కువ సార్లు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.

 

ఇక ఈ టాయిలెట్ పేపర్స్ విషయానికి వస్తే చాలా రకాల టాయిలెట్ పేపర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే కాన్సెంట్రేట్ టాయిలెట్ రోల్స్ ని ఉపయోగించే వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కెమికల్స్ ఉండే ఈ పేపర్స్ ని ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అందుకనే కెమికల్స్ లేని వాటిని కొనుగోలు చేస్తే మంచిది. అయితే ఎలాంటి సమస్యలు కెమికల్స్ వుండే టిష్యూ పేపర్స్ తో తుడుచుకోవడం వల్ల కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

చర్మ సమస్యలు:

కెమికల్స్  కలిగిన ఈ పేపర్లను ఉపయోగించడం వల్ల చర్మం ఇరిటేషన్ వస్తుంది. అలానే దురదలు మరియు ర్యాషెస్ కూడా చర్మంపై కలుగుతాయి. అలాగే ఇది ఇతర సమస్యకు కూడా దారి తీస్తుంది.

వాపు మరియు నొప్పి ఎక్కువగా రావడం:

టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత టిష్యూ పేపర్ తో తుడుచుకుంటూ ఉండడం వల్ల వాపులు మరియు నొప్పి కలుగుతుంది. అలానే పైల్స్ సమస్యలు కూడా దీని వల్ల వస్తూ ఉంటాయి. బ్లీడింగ్, చర్మం మంట రావడం మొదలైన ఇబ్బందులు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news