సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన.. జగన్ కీలక ప్రకటన

-

 

 

 

సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు. ఇవాళ వైసీపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం 4 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతా అంటూ కీలక ప్రకటన చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

 

ప్రతి పార్లమెంటులో బస చేస్తానని..పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తా అంటూ వైఎస్ జగన్ తెలపడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నడుము కడతానని తెలిపారు. అడుగడుగునా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా వ్యాఖ్యానించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. కేసులు పెడుతున్నారని ఎవరు భయపడకూడదని… కోరారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. కచ్చితంగా కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version