ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినడం లేదా..? అయితే ఇవి మీరు తెలుసుకోవాలి..!

-

చాలా మంది పెద్దవాళ్ళు అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ ని తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ల కోసం ముఖ్యమైన సమాచారం. ఒక పరిశోధన ద్వారా తేలింది ఏమిటంటే..? ఉదయాన్నే అల్పాహారం తీసుకోక పోవడం వల్ల అల్పాహారం లో వచ్చే పోషకాలు మరి ఎందులోను రావని దీని కారణంగా చాలా పోషకాలు అందవని అన్నారు.

యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చేసిన రీసర్చ్ ప్రకారం క్యాల్షియం పొటాషియం ఫైబర్ విటమిన్ డి చాలా ముఖ్యం అని చెప్పింది. అదే విధంగా గర్భిణీలకు వీటితో పాటు ఐరన్ కూడా అవసరమని చెప్పింది.

ఇవి కనుక అందక పోతే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పింది. పిల్లలు ఎవరైతే అల్పాహారం తీసుకోరో వాళ్ళ ఫోకస్ తగ్గుతుందని చెప్పారు. అలానే పెద్దల్లో కూడా వివిధ సమస్యలు వస్తాయని చెప్పారు.

నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే చేయగా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఎవరైతే అల్పాహారం తీసుకుంటారో వాళ్లలో ఫైబర్, మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఉన్నాయని చెప్పింది.

అదే విధంగా ఎవరైతే అల్పాహారం తీసుకోరో వాళ్ళు భోజనం మరియు రాత్రి డిన్నర్ కూడా ఎక్కువగా తీసుకుంటారని.. ఉదయం అల్పాహారం తీసుకునే పోషకాలు మాత్రం అందవని అల్పాహారం తీసుకునే వాళ్లలో పోషక పదార్థాలు వేరేగా ఉంటాయని.. తీసుకోక పోయినా వాళ్లలో వేరేగా ఉంటాయి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news