వేసవిలో జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

భారతదేశం లో వేసవి లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. నిజంగా వేడి గాలులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పైగా ఇదంతా కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలానే జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చాలా సాధారణమైన గుండెల్లో మంట, కాన్స్టిపేషన్ మొదలైనవి వస్తూ ఉంటాయి.

అలాగే చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ కి గురవుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఎందుకవుతుంది అంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏవైనా ఆహారం లో ఉన్నప్పుడు మనకి వస్తుంది.

నోరో వైరస్ ఫుడ్ పాయిజన్ కి కారణం. అయితే జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా సమ్మర్ లో వీటిని అనుసరించండి. దీనితో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి వీలవుతుంది.

మంచినీళ్లు ఎక్కువగా తీసుకోండి:

డీహైడ్రేషన్ కి గురవకుండా మంచి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. సరిపడా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువగా చెమట వల్ల మన ఒంట్లో నీళ్లు తగ్గిపోతుంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు తీసుకోండి. అలానే ఉప్పు వేసిన మజ్జిగ తీసుకోవడం కూడా మంచిది. అలాగే తాజాగా తయారు చేసిన జ్యూస్ ని కూడా తీసుకోండి మరియు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి.

పాలు, పాల పదార్థాలు:

ఎక్కువగా ప్రోబయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. యోగర్ట్, చీజ్, పాలు ప్రతి రోజూ తీసుకోండి.

హైజీన్ గా ఉండండి:

భోజనం తినే ముందు చేతులు కడుక్కోవడం తో పాటు పెంపుడు జంతువులు ముట్టుకున్నప్పుడు, డైపర్ తీసినప్పుడు ఇలా ఇటువంటి పనులు ఏమైనా చేసినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి. అలాగే వీలైనంత వరకు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news