బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకపోవడమే బెటరా..?

Join Our Community
follow manalokam on social media

కరోనా సంక్షోభం కారణంగా గతేడాది నుంచి అన్ని వ్యాపార సంస్థలు, బ్యాంకులు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఆయా బ్యాంకులు కూడా రుణంపై వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్ల తగ్గింపు భారం డిపాజిట్లపై కూడా పడటంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల కస్టమర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభం చేకూరదని భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణ రేటులో సర్దుబాటు చేసినట్లయితే డిపాజిట్‌పై ప్రతికూల రాబడి లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

డబ్బులు
డబ్బులు

మింట్ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం జనవరి, ఫిబ్రవరి నెలలో మినహా మిగిలిన టర్మ్ డిపాజిట్లపై నికర వడ్డీ రేటును మార్చి నెలల 0.03 శాతానికి తగ్గించింది. జనవరిలో ద్రవ్యోల్బణం 0.30 శాతంగా ఉంటే, ఫిబ్రవరిలో 0.94 శాతంగా కొనసాగింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలలో నికర రాబడి వడ్డీ రేటును 1.13 శాతానికి, జూలైలో 1.63 శాతానికి, ఆగస్టులో 1.59 శాతానికి, అక్టోబర్‌లో 2.71 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెల వరకు 5 నుంచి 5.2 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. కాగా, కొన్ని బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి.

ప్రముఖ గృహరుణ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ వివిధ కాలాల స్థిర డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25 శాతానికి పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 30వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. స్థిర డిపాజిట్లపై పలు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్న సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా, ప్రస్తుతం ఎస్‌బీఐ 4.90 శాతం వడ్డీరేటు, ఐసీఐసీఐ 4.90 శాతం, యాక్సిస్ బ్యాంక్ 5.15, కోటక్ మహీంద్రాబ్యాంక్ 4.50 శాతం వడ్డీరేటులను కల్పిస్తున్నాయి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...