ఆరోగ్యానికి కలబంద ఎంతో మేలు చేస్తుంది. కలబంద వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అనారోగ్య సమస్యలు మొదలు చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా అలోవెరా మనకు సహాయ పడుతుంది. అయితే నిజానికి అలోవెరా వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు.
చాలా మంది ప్రతి రోజూ కలబంద జ్యూస్ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా కలబంద ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా కలబంద జ్యూస్ తాగుతున్నారా..? అయితే దీని వల్ల కలిగే నష్టాలు గురించి కూడా చూడాల్సిందే. కలబంద రసాన్ని ఎక్కువగా తాగడం వల్ల కొన్ని రకాల సమస్యలు తప్పవు. మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ సమస్యల గురించి చూద్దాం.
డయేరియా:
కలబంద జ్యూస్ ని ఎక్కువగా తాగడం వల్ల డయేరియా వస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోం సమస్యలను తీసుకొస్తుంది. కాబట్టి కలబంద జ్యూస్ ని ఎంత మోతాదులో తాగాలో అంతే తాగండి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఈ సమస్య తప్పదు.
ఎలర్జీలు:
కలబంద జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారని చాలామంది తాగుతూ ఉంటారు. అయితే బాగా ఎక్కువ తాగడం వల్ల చర్మానికి ఎలర్జీలు వంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.
హృదయ సంబంధిత సమస్యలు:
కలబంద రసాన్ని బాగా ఎక్కువగా తాగడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా కలబంద జ్యూస్ ని తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. పైగా ఎక్కువ కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల పొటాషియం ఒంట్లో ఎక్కువ అవుతుంది దీంతో హార్ట్ రేట్ పై ప్రభావం చూపిస్తుంది.
చూశారు కదా అధిక మోతాదులో కలబంద రసం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. కనుక ఈ సారి కలబంద రసాన్ని తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం మంచిది లేదంటే ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.