జంక్ పుడ్ ఎక్కువగా తింటున్నారా.. పిల్లలు పుట్టడం కష్టమే..!?

-

ఇప్పుడున్న బీజీ లైఫ్ లో జంక్ ఫుడ్ భాగం వీడతీయలేనిది. వంట చేసుకోవాలనుకున్న జంక్ ఫుడ్ గుర్తువచ్చి.. చక్కగా అర్డర్ పెట్టేసి అరగస్తాం. దీంతో మనం అరోగ్యకరమైన ఆహారనికి దూరం అవుతున్నమని తెలుసు కానీ మానుకోలేకపోతున్నం. కానీ, జంక్ ఫుడ్ ని దూరం పెట్టకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Junk-Food
Junk-Food

తాజా అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ నిజాలు:

జంక్ ఫుడ్ అతిగా తినేవారి పై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళల పై జంక్ ఫుడ్ ప్రభావాల పై అధ్యయనం చేశారు. మహిళలు ఫాస్ట్ ‌ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు వస్తాయని సంస్థ పేర్కొంది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 5 వేల మందికి పైగా మహిళల పై ఈ పరిశోధన నిర్వహించారు.

పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటివి సంతాన సామర్థ్యం తగ్గిస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. మద్యపానం, ధూమపానం, వయసు, శరీరతత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం చేశారు. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తింటూ, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చుతారని తెలిపారు. కానుక జంక్ ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒక వేళ మీరు జంక్ ఫుడ్ బానిసలా అయితే ఇప్పటి నుంచే ఫాస్ట్ ఫుడ్ ను దూరం పెట్టండి. మీ ఆరోగ్యలను భవష్యత్ తరాల ఆరోగ్యాలను కాపాడండి

Read more RELATED
Recommended to you

Latest news