చపాతీ, అన్నం కలిపి తింటున్నారా…. ఎంత డెంజరో తెలుసా?

-

బరువు తగ్గాలని చాలామంది రాత్రిపూట చపాతీలు, రొట్టెలు తింటుంటారు. ఇంకొంతమంది..రెండు చపాతీలు..కొంచెం రైస్ తింటారు. చపాతి, అన్నం తినటం మనం ఎప్పటినుంచే ఫాలో అవుతున్న పద్దతి.. కానీ ఇలా తినటం మంచిది కాదట. ఈ కాంబినేషన్లో తింటే ఎంత ప్రమాదమట. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. పొట్ట కూడా పెరుగుతుందట. ఇలా తింటే ఏ ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

కేలరీలు..

చపాతీ, అన్నం కలిపి తింటే పొట్ట బరువు పెరుగుతుంది. అంతేకాదు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యాహ్నం లేదా రాత్రి మాత్రమే అన్నం తినాలి. చపాతీ తినాలంటే కేవలం చపాతీ మాత్రమే తినండి. రెండింటిని అస్సలు కలిపి తినకూడదు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అంటే చల్లని అన్నం తింటే శ్వాసకోశ లేదా ఆస్తమాతో బాధపడేవారికి మరింత సమస్య అవుతుందట.అందుకే వారు అన్నం మానేయాలి.

బరువు..

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లియతే మీరు సరైన మోతాదులో ఆహారం తీసుకోకుండా..ఈ కాంబినేషన్ లో తింటే వ్యర్థమవుతుంది. ఇది ఒబేసిటీకి దారితీస్తుంది. కొవ్వు చేరితే దాన్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది.

అజీర్ణ సమస్యలు..

కొందరు భోజనం తినేటప్పుడు ఎక్కువ మొత్తంలో తింటారు. ఇది అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. చపాతి, అన్నం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో కడుపులో గ్యాస్ నిండిపోతుంది. దీనివల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.

డయాబెటిస్..

అన్నం ఎక్కువ తింటే శరీరంలో డయాబెటిస్, ఒబేసిటీ వస్తుంది. అందుకే ఘుగర్ పేషంట్స్ ని అన్నం తక్కువగా తినమంటారు. ఇది గుండె మూత్రపిండాల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

జీర్ణక్రియ..

మీరు రాత్రిపూట అన్నం, చపాతీ రెండు కలిపి తింటే కడుపు సమస్యలు మొదలవుతాయి. రాత్రిపూట జీర్ణక్రియ సాధరణంగానే నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి తేలకగా అరిగేవి మాత్రమే తీసుకోవటం మంచిది.

మనలో చాలామంది..చపాతి, అన్నం కలిపి లాగించేస్తుంటారు. దీని ఫలితం తక్షణం చూపించకపోయినా…దీర్ఘకాలికంగా ఇదే పద్ధతి ఫాలో అయితే..అనారోగ్య సమస్యల భారిన పడటం తప్పదంటున్నారు నిపుణులు. కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే తినటానికి ప్రయత్నించండి. లేదా గ్యాప్ ఇచ్చి తినటం మేలు.

                                                                                                                 triveni

Read more RELATED
Recommended to you

Exit mobile version