ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు ఇవే

-

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో… బిపిన్ రావత్ మినహా… 13 మంది మరణించారు. ఇందులో బిపిన్ రావత్ భార్య, ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆర్మీ సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన.. సమయంలో అక్కడే ఉన్న ఓ స్థానికుడు.. ఈ ఘటన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ కుమార్ అనే వ్యక్తి.. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన ఏం చెప్పారంటే అంటే..

 

“నేను నా ఇంటి పనులు చేసుకుంటున్నాను. ఒక్కసారిగా నాకు భారీ శబ్దం వినిపించింది. అటు వైపు తిరిగాను. హెలికాప్టర్ ఓ చెట్టును ఢీకొనడంతో చూశాను. వెంటనే అక్కడికి చేరుకున్నాం. హెలికాప్టర్ మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల మొత్తం పొగ దట్టంగా అలముకుని ఉంది. నేను వెంటనే మా ఇంటి పక్క ఆ వ్యక్తి పిలిచి ఏం జరిగిందో చెప్పా. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. అంతలోనే పోలీసులు వచ్చారు. మాకు చాలా భయమేసింది.” అని ప్రత్యక్షసాక్షి కృష్ణకుమార్ పేర్కొన్నారు. తాజాగా ఈ ప్రమాదం పై మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో… మంత్రులు సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version