కండరాల మన శరీరంలో ఎంత ముఖ్యమో తెలుసా? కండపుష్టికి ఈ ఆహారం బాగా తినాలి

-

మనిషి బలంగా ఉన్నాడా లేదా అనేది కండను చూసి తెలుస్తుంది. కండుపుష్టి ఎంత బలంగా ఉంటే..మనషి అంత స్ట్రాంగ్ గా ఉన్నట్లు. కండరాలు గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. ఈరోజు మనం మన శరీరంలో ఎన్ని కండరాలు ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయి? అనేది పూర్తిగా తెలుసుకుందాం. బాడీ బయట చూసినదానికంటే.ఎన్నోరెట్లు లోపల ఉంటుంది. లోపల మెకానిజం బాగా తెలుసుకుంటే..ఏ భాగానికి ఏ ఆహారం కావాలో, అవి ఎలా పనిచేస్తాయో మనకు అర్థమవుతుంది కదా.

కండరాల వ్యవస్థ అనేది మన శరీరంలో ప్రతి భాగాన్ని కతపడానికి ఉపయోగపడతాయి. నరాలు ద్వారా మెదడు నుంచి కానీ, స్పైనల్ కాడ్ నుంచి కానీ సంకేతాలు వెళ్లి ఏ కండరాన్ని కదిపితే ఆ భాగంలో కదలికలు వస్తాయి. శరీరం మూమెంట్ అంతా కండరాలు మీద ఆధారపడే జరుగుతుంది. అలాంటి కండరాలు మన బాడీలో 600పైగా ఉంటాయి. ఈ కండరాలు బరువు మనబాడీ వెయిట్ లో 40శాతం ఉంటుంది. ఎముకల మీద ప్రజర్ రాకుండా..ఆ భారాన్ని తట్టుకునేట్లు కూడా కండరాలు ఉపయోగపడతాయి. ఎముకలపై పైన ఉండే రక్షణ ఇవి. అలాంటి కండరాలు మన శరీరంలో మూడు భాగాలుగా ఉంటాయి.

స్మూత్ మజిల్ (Smooth muscle)
స్కెలిటెల్ మజిల్ (Skeletal muscle )
కార్డియక్ మజిల్ ( Cardiac muscle)

ఒక్కోదాని పాత్ర భిన్నంగా ఉంటుంది. మనం ఏ పని ఎన్ని గంటలు చేయాలన్నా కండరాల్లో ఉండే బలాన్ని బట్టి మన పని సామార్థ్యం అంచనా వేయటం జరుగుతుంది. కండరాలు ఎంత వాడితే అంత పనిచేస్తాయి..

మనకు స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరలా సంకేతం ద్వారా సిగ్నల్స్ అందుకుని స్మూత్ మజిల్స్ పనిచేస్తాయి. పొట్ట అంచులకు ఉండే కండరాలు, పేగుల అంచులకు ఉండే కండరాలు. ఊపిరితిత్తులు ముడుచుకుని సాగటానికి స్మూత్ మజిలే చేస్తుంది. మన శరీరంలో రక్తం ప్రయాణిండానికి రక్తనాళాల పైన ఉండే స్మూత్ మజిలే కారణం.

పేరుకు తగ్గట్టే ఇది ఎముకల పైన కప్పబడి ఉంటుంది. అందుకే దీన్ని స్కెలిటెన్ మజిల్ అంటారు. ప్రతి ఎముకకు ఈ కండరం సహాయం ఉంటుంది. మన మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాలు ద్వారా వెళ్లి ఎముకలకు డైరెక్షన్స్ ఇస్తాయి. మన శరీరంలో అతి బలమైన కండరం దవడ కండరం. మన బాడీలో ఉండే కండరాలన్నింటిలో కంటే..బాగా బిజీగా ఉండే కండరం..ఎక్కువ పనిచేసి తక్కువ రెస్ట్ తీసుకుని కండరం గుండె కండరం, కంటిరెప్పలకు ఉండే కండరం.

ఇక మూడవది గుండెకు సంబంధించిన కండరం..గుండె కండరం సంకోచ వ్యాకోచం చేయటం ద్వారానే గుండె గదుల్లో ఉండే రక్తం బయటకు వస్తుంది కదా.. ఎంత బాగా ముడుచుకుంటే అంత బాగా రక్తం బయటకు వస్తుంది. గుండె కండరం 0.4 సెకండ్స్ రిలాక్స్ అయితే చాలు. ఈ కార్డియక్ మజిల్ అనేది తల్లిగర్భంలో 5వ వారం నుంచి కొట్టుకోవడం మొదలపెడుతుంది. తుది శ్వాస విడిచే వరకూ ఇది కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ మజిల్ కపాసిటీ 150 ఏళ్లు.గర్భశాయ కండరాలు..మూడు కేజీల బరువు ఉండే శిశువను తోయాలంటే..ఎంతోబలం కావాలి. తొడ కండరాల కంటే చాలా బలమైన కండరం..ఇది బాగా బలంగా ఉండే నాచురల్ డెలివరీ ఫ్రీగా అవుతుంది. వీక్ గా ఉంటే..ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది.

ఇవి కండరాలు పనిచేసే తీరు. ఇవి అన్నీ వీటి పనులు సక్రమంగా చేయాలంటే..కండపుష్టి బాగా ఉండాలి. మరి అవి బలంగా ఉండాలంటే ఏం తినాలి అనే సందేహం మీకు మెదిలే ఉంటుంది. .కండపుష్టిగా మెయిన్ గా కావాల్సింది..ప్రొటీన్.స్ప్రౌట్స్, ఎండువిత్తనాలు, కందిపప్పు, పెసరప్పు, సోయాబీన్స్, రాజ్మాగింజలు, మీల్ మేకర్స్ ఇవన్నీ ప్రోటీన్ ఉండేవి. మాంసాహారంలో కూడా ప్రొటీన్ బాగా ఉంటుంది. కండరాలు వాడేకొద్ది బలం పెరుగుతాయి..అందుకే వ్యాయామాలు చేస్తే..అవి స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి బాడీకీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం..కొంతమంది 18గంటలు పనిచేసినా అలిసిపోరు..ఎందుకంటే వారి కండరాలు సహరిస్తాయి..మరికొంతమంది 7గంటలకే అలసిపోతారు..వారి కండరాలు అంత వీక్ గా ఉన్నాయి కాబట్టి. మంచి ప్రొటీన్ ఫుడ్ తింటూ..బాడీకి వ్యాయామం చేస్తే..కండరాలు ఇనుపకండరాల్లా బలంగా తయారవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news