కమలాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. ముఖ్యంగా చలి కాలంలో కమలాలని తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే చాలా సమస్యల నుండి బయట పడవచ్చు.
జలుబు సమస్య ఉండదు:
జలుబు తగ్గడానికి కమల బాగా ఉపయోగపడుతుంది. కమల తో తేనే, రాక్ సాల్ట్ ని కలిపి తీసుకుంటే జలుబు సమస్య నుండి బయటపడవచ్చు. ఆస్తమా సమస్య కూడా ఉండదు.
గర్భిణీలకు మంచిది :
విటమిన్ సి ఇందులో సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా అలర్జీల నుండి కూడా ఇదే బయట పడేస్తుంది. గర్భిణీలకు సమస్యలు వుండవు. అలానే అజీర్తి సమస్యల తో బాధ పడే వాళ్ళకి కూడా కమల బాగా ఉపయోగ పడుతుంది. అజీర్తి సమస్య తొలగిపోవాలంటే కమల తొక్కల పొడి తీసుకుంటే మంచిది.
హృదయ ఆరోగ్యానికి మంచిది:
హృదయ సమస్యల్ని తొలగించడానికి కమలా రసం బాగా ఉపయోగ పడుతుంది. అలానే కడుపు నొప్పి వంటి సమస్యల నుండి కూడా బయట పడవచ్చు. డయేరియా నుండి కూడా బయట పడచ్చు. ఇలా ఇన్ని లాభాలు కమలాలతో మనం పొందవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.