ద్రాక్షపండ్లు ఇష్టమని అతిగా తింటున్నారా..? అయితే ఈ సమస్యలు మీకు తప్పవు..!

-

చాలా మందిలో ఉండే చెడ్డ లక్షణం ఏమిటంటే నచ్చిన ఆహారపదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఆహార పదార్థాలను అతిగా తినడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆహార పదార్థాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ కూడా అతిగా తింటే నష్టాలు తప్పవు. అదే విధంగా ద్రాక్ష పండ్లు అతిగా తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Grapes | SNAP-Ed

ద్రాక్ష పండ్లలో విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భిణీలు తీసుకోవచ్చు. యూట్రస్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అలానే కడుపులో ఉండే శిశువుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ద్రాక్షల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ శిశువు యొక్క మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలాంటి లాభాలు ఉన్నప్పటికీ అతిగా ద్రాక్ష పళ్ళు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తప్పవు అని నిపుణులు అంటున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువవుతుంది:

అతిగా ద్రాక్ష పండ్లు తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు పెరుగుతుంది. ప్రతి రోజూ ద్రాక్షపండ్ల రసం తీసుకున్న వారిలో 25 శాతం నుండి 30 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.

హార్మోన్ సెన్సిటివిటీ పెరిగిపోవడం:

ద్రాక్ష ఈస్ట్రోజన్ లెవెల్స్ ను పెంచుతుంది. అలాగే హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్ల రిస్క్ ని పెంచుతుంది. హార్మోన్ సెన్సిటివిటీ ఉన్న మహిళలు ద్రాక్ష పండ్లను తగ్గించడం మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి.

ఆస్తమా పెరుగుతుంది:

అతిగా ద్రాక్ష పళ్ళు తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు కలుగుతాయి. ఇరిటేషన్, ర్యాషెస్ సమస్యలు కూడా వస్తాయి. అలానే కార్డియోవాస్క్యులర్ సమస్యలు ద్రాక్ష పండ్లు అతిగా తీసుకోవడం వల్ల వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు అతిగా ఏది తీసుకోకండి ముఖ్యంగా ద్రాక్షపండ్లను అతిగా తినొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news