ఒక స్త్రీ గర్భం దాల్చటం తనకు, తన కుటుంబసభ్యులకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ 9 నెలలు ఆమె పడే ఇబ్బంది, డెలివరీ పెయిన్స్ వర్ణాణాతీతం. ముఖ్యంగా నెలలు గడుస్తున్న కొద్ది..ఏదీ తినాలనిపించదు, వికారంగా ఉంటుంది. శరీరంలో చెప్పలేని సమస్యలు వస్తాయి. ఇది అని వివరించటం కూడా సాధ్యం కాదు. ప్రతినొప్పికి టాబ్లెట్స్ మింగటం పరిష్కారం కాదు. బేబీ ఆరోగ్యం చాలా ముఖ్యం. జనరల్ గా నే అమ్మాయిలకు ఫుడ్ విషయంలో బోలెడు టేస్టులు. ఇష్టంలేనివి లెక్కలేనన్ని ఉంటాయి. కానీ ఆ టైంలో తినాల్సిందే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే..పాదాలు వాపు రావడం. గర్భిణీలకు పాదాలు వాపు రావడం అనేది సర్వసాధారణం. ప్రతి గర్భిణీ దీన్ని అనుభవిస్తుంది. వీటిని చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ వాపు సమస్యను ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అవేంటో ఈరోజు చూద్దాం.
గర్భధారణ సమయంలో శరీరంలోని అదనపు నీరు, గర్భాశయంపై ఒత్తిడి పెరగడం వల్ల పాదాలు, కాళ్ళలో వాపు ఏర్పడుతుంది. ఇది ప్రసవ సమయంలో కూడా పెరుగుతుంది. వాపు పెరిగినప్పుడు, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. నిర్జలీకరణానికి గురైనప్పుడు కూడా మీ కాళ్లు వాపునకు గురవుతాయి. కాబట్టి గర్భధారణ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి.
కాళ్లవాపును తగ్గించుకోవాలంటే..ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఇది పాదాల వాపును తగ్గిస్తుంది. ఉప్పు శరీరాన్ని అధికంగా ఉంచడమే దీనికి కారణం. కాబట్టి అదనపు ఉప్పు తీసుకునే అలవాటు మానేయడం మంచిపద్ధతి.
గర్భధారణ సమయంలో పొటాషియం కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు కాళ్లు వాపునకు గురవుతాయి. ఈ సమయంలో పొటాషియం అధికంగా ఉండే బీన్స్, అరటిపండుతో సహా వివిధ రకాల ఆహారాలను తినండి.
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మీరు ఎక్కువగా కాఫీ తాగితే ముందుగా ఆ అలవాటు మానేయండి.. దీంతో కాళ్లవాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
పాదాలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల వాపు తగ్గుతుంది. పాదాలకు మసాజ్ చేయమని మీ ఇంటి సభ్యులను అడగండి.
నెమ్మదిగా కాళ్లను నూనెతో మసాజ్ చేస్తే వాపు పరిష్కారం అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎడమవైపునకు తిరిగి నిద్రపోవాలి. ఇదే మంచి అలవాటు. పాదాలను వేలాడే పద్దతిలో కుర్చోకూడదు. నేలకు ఆనేలా చూసుకోవాలి. రోజూ కాసేపు వాకింగ్ చేయాలి.
– Triveni Buskarowthu