ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా..? అయితే సమస్యే..!

-

సాధారణంగా ఉదయం లేవగానే మనకి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అయితే ఆకలి వేస్తోంది కదా అని మనం నచ్చినవి తినేస్తూ ఉంటాము. కానీ నిజానికి ఈ ఆహార పదార్థాలను అసలు ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి. అయితే ఖాళీకడుపుతో తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

టమాటా:

టమాటా లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దానిని తీసుకోకూడదు. ఒకవేళ కనుక తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. అందుకని ఈ ఖాళీ కడుపుతో అస్సలు టమాటని తీసుకోకూడదు.

పెరుగు:

ఖాళీ కడుపుతో పెరుగు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఎసిడిటీ మొదలైన సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి పెరుగును కూడా అస్సలు ఖాళీ కడుపుతో తీసుకోవద్దు.

పంచదార:

పంచదార మొదలైన స్వీట్నర్స్ ని తీసుకోవడం వల్ల లివర్ లో ఇబ్బందులు వస్తాయి. లివర్ డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పంచదార ఖాళీకడుపుతో తీసుకోవద్దు.

అరటి పండ్లు:

అరటిపండు కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి. అరటి పండ్లని ఖాళీ కడుపుతో తీసుకుంటే కాన్స్టిపేషన్ మొదలైన సమస్యలు వస్తాయి కాబట్టి వీటికి ఉదయాన్నే దూరంగా ఉండండి.

టీ మరియు కాఫీ:

ఉదయాన్నే టీ, కాఫీలను చాలామంది తాగుతూ ఉంటారు. దీని వల్ల ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయాన్నే ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version