ఊపిరి బిగపట్టకండి.. బదులుగా ఇలా చేస్తే కరోనాకు చెక్‌!

-

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్న పరిస్థితి ప్రస్తుతం. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా.. మన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకోని ఉండాల్సిన దుస్థితి. యూసీ సీడీసీ అధికారులు ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి కొన్ని గైడ్‌లైన్స్‌ జారీ చేశారు. ఇన్ఫెక్షన్‌ సోకకుండా తీసుకోవాల్సిన నియమాలేంటో చూద్దాం. మీ ఆఫీస్‌ పరిసరాల్లో సరైన వెంటిలేషన్‌ ఉండే విధంగా చూసుకోవాలని ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు కే విజయరాఘవన్‌ తెలిపారు. అదేవిధంగా ఇంటి పరిసరాలకు కూడా వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాని సూచించారు.


ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సలైవా, నాసల్‌ వల్ల వచ్చే డ్రాప్లెట్స్‌ ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. పూర్తిగా వెంటిలేషన్‌ లేని ప్రదేశాల్లో ఈ వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తుందని పీఎం అడ్వైజరీ తెలిపారు.

మే 7న దీనికి సంబంధించిన గైడ్‌ లైన్స్‌ ను యూఎస్‌ సీడీసీ జారీ చేసిందని విజయ్‌ తెలిపారు. యూఎస్‌ వాచ్‌డాగ్‌ కూడా వైరస్‌ వ్యాప్తిపై సుదీర్ఘ పరిశీలనలు చేసిందని, సీడీసీ కూడా మూడు ముఖ్య ఆదేశాలను జారీ చేసిందని ఆయన చెప్పారు.

  • – శ్వాస తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో వైరస్‌ సంబంధిత డ్రాప్లెట్స్‌ శ్వాసనాళానికి వెళ్తుంది. వైరస్‌ వ్యాప్తికి ఇతర కారణం శ్వాసను వదిలినపుడు, కళ్లు, ముక్కును తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.
  • తాజా సీడీసీ అప్డేడ్‌ ప్రకారం వైరస్‌ వ్యాప్తి 6 అడుగుల పైకి కూడా వ్యాపిస్తుంది. ఇది దగ్గర కూర్చునప్పుడు వ్యాపించే వైరస్‌ కంటే తక్కువ ప్రమాదం. అరడుగుల పైకి కూడా అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మరో విషయం అంత దూరం కూడా పాటించాలి. మన దేశీయ నిపుణుల ప్రకారం కనీసం 10 మీటర్ల దూరం పాటించడం తప్పనిసరి.
  • వెంటిలేషన్‌ తగిన విధంగా ఏర్పాటు చేసుకుంటే గాలి పీల్చుకునేటపుడు ఏవైనా విషవాయువులు ఉంటే సులభంగా బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఇంట్లోకి బయటి గాలి సులభంగా వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ప్రయాణించేటప్పుడు కూడా కిటికీలను మూసి ఉంచకూడదని తెలిపింది. గ్రామాల్లో నివసించే వారికి కూడా ఎగ్సాస్టింగ్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసుకోవాలని గ్రామపంచాయతీలకు సూచించింది. దీంతోపాటు డబుల్‌ మాస్కును వాడటం కూడా తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version