జామ పండ్లు మనకు ఏడాది పలు సీజన్లలో లభిస్తాయి. ఇక శీతాకాలం సీజన్ లో జామ పండ్లు మనకు ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్‌లో భిన్న రకాల జామ పండ్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. జామ పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే పండ్లే కాదు, జామ ఆకులను తిన్నా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే…
* జామ ఆకులను తరచూ తినడం వల్ల గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
* నిత్యం జామ ఆకులను తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతి వంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.
* నిత్యం మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. అయితే కొలెస్ట్రాల్‌కు జామ ఆకులు అడ్డుకట్ట వేస్తాయి. నిత్యం వాటిని తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే హార్ట్ ఎటాక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు రాకుండా ఉంటాయి.
* జామ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు తాకేలా ఆ పేస్ట్‌ను రాయాలి. తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకల సమస్యలు ఉండవు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
* ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో జామ ఆకులు కొన్నింటిని వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని తాగుతుంటే దగ్గు తగ్గుతుంది. ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
* జామ ఆకుల నీటిని తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది.