గురక.. పెట్టేవాళ్లకు ఏ సమస్య రాదు కానీ.. వారి పక్కన పడుకునేవారికి నరకమే. పక్కన ఉన్న వాళ్లు గురక పెడుతుంటే నిద్రపోయే వాళ్లకు అస్సలు నిద్ర పట్టదు. అయితే గురక పెట్టి నిద్రపోయే వాళ్ల ఆరోగ్యానికి భవిష్యత్తులో జరిగే నష్టం ఎక్కువని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధనల్లో గురక వల్ల గుండెపోటుతో నిద్రలోనే ప్రాణంపోయే వాళ్లు ఎక్కువ మంది ఉంటారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
గురకకు చాలా కారణాలు కూడా ఉన్నాయి… గురకకు స్థూలకాయం పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాల వల్ల గురక వస్తుంటుంది, పై కారణాల వల్ల త్వరగా మెలకువ వచ్చి ఆక్సిజన్ లోపం కలుగుతుంది. అయితే గురకకు గుండె జబ్బులకు లింకేంటంటే.. శ్వాసకు ఇబ్బందులు ఏర్పడితే సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ స్థితి గుండె మీద ఒత్తిడి పెంచుతుంది.
అప్పుడు హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. సాధారణంగా గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోతుంది. అయితే గురకతో నిద్రా భంగం కలగకుండా నోట్లో అమర్చుకునే పరికరాలున్నాయి. స్లీప్ నియంత్రించే పరికరం సీపాప్ ఉపయోగించవచ్చు. గురక అంతిమంగా గుండె జబ్బులకు కారణం అవుతుందని తేలింది. సో అందరూ జాగ్రత్తలు పాటించండి.