ఎప్పుడూ స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయి వృధా అయిపోతున్నాయి..? అయితే ఇలా చేస్తే సరి…!

-

పాలను స్టవ్ మీద పెట్టి మర్చిపోతే అవి పొంగిపోయి వృథా అయి పోతుంటాయి. అందరి ఇంట్లో ఇది సర్వ సాధారణంగా జరిగేదే. గిన్నెలో పాలు పెట్టి కాసేపు అలా మరిచిపోయి వదిలేస్తే మొత్తం పాలు పొంగి పోతాయి. అయితే అలా పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మంది మర్చిపోవడం వల్ల పాలు పొంగిపోయి వృధా అయి పోతుంటాయి.

 

నిజానికి చాలా బాధ అనిపిస్తుంది తర్వాత. అయితే పాలు వృధా అయిపోయాయి అని తర్వాత బాధ పడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పాలను పొంగకుండా ఉంచచ్చు. అది ఎలా అంటే.. ఈ పాలనే గిన్నెలో వేసి ఒక చెక్క గరిటని పెడితే పాలు పొంగకుండా ఆపచ్చు.

ఎంత పెద్ద మంట లో ఉన్నా సరే చెక్క గరిట వరకు వచ్చి ఆగిపోతాయి. ఎందుకు చెక్క గరిట వల్ల ఆగిపోతాయి అనే లాజిక్ ని చూస్తే… కింద మంట పెట్టినప్పుడు పాలు ఒక పొరగా ఏర్పడతాయి. అలా వచ్చిన పోర గరిటని తాకగానే ఆవిరితో పగిలిపోతుంది. పైకా చెక్క త్వరగా ఉష్ణాన్ని తీసుకుంటుంది కాబట్టి త్వరగా వేడెక్కవు అందుకే పాలు అక్కడికి వచ్చి ఆగిపోతాయి. కాబట్టి ఈ టెక్నిక్ ఫాలో అయితే పాలు పొంగి పోకుండా ఆపచ్చు పాలు కూడా వృధా అయిపోవు.

Read more RELATED
Recommended to you

Latest news