ద‌ళితుల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌.. త్వ‌ర‌లోనే ద‌ళిత బంధు నిధుల విడుద‌ల‌

ద‌ళితుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. త్వ‌ర‌లోనే ద‌ళిత బంధు నిధులను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్‌. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే ‘దళిత బంధు పథకం ‘ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.

kcr
kcr

దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడి గా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడం లో దోహద పడుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని,. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధు ను ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.