కాళ్ల‌పారాణి ఆర‌క‌ముందే న‌వ‌వధువు మృతి..వాగు దాటుతుండ‌గా..!

కాళ్ల‌పారాణి ఆర‌క‌ముందే న‌వ‌వ‌ధువు మృతి చెందింది. ఈ ఘ‌ట‌న వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలోని మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం నాడు పెళ్లి జరిగింది. కాగా వివాహం అనంత‌రం విందుకోసం వ‌ధువు ప్ర‌వ‌ళిక‌తో పాటు బంధువులు ఆదివారం మోమిన్ పేట్ కు వెళ్లారు. మ‌ళ్లీ సాయంత్రం తిరిగి గ్రామానికి బ‌య‌లుదేరారు.

కాగా మార్గ‌మ‌ధ్య‌మంలో తిమ్మాపూర్ వ‌ద్ద వాగు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న విష‌యాన్ని డ్రైవ‌ర్ గ‌మ‌నించ‌లేదు. దాంతో న‌వ‌వ‌ధువుతో వెళుతున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. కారులో పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు, ఆమె సోద‌రి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు కూడా వ‌ర‌ద‌లో గ‌ల్లంత‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో వ‌రుడు అత‌డి సోద‌రి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా వ‌దువుతో పాటు మ‌రొక‌రి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. మ‌రో ఇద్దరి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.