ప్రయాణం సమయంలో వాంతులు అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని అనుసరించండి..!

-

చాలా మందికి ప్రయాణాలు చేసినప్పుడు పడదు. వికారం, వాంతులు ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే మీకు కూడా ప్రయాణాలు పడవా..?, ప్రయాణం సమయంలో వికారం, వాంతులు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఇలాంటి సమస్యలు రావు. మరి ఆలస్యం ఎందుకు ఆ ఇంటి చిట్కాల గురించి చూసేద్దాం.

పుదీనా:

పుదీనా వాంతులు అవ్వకుండా చూసుకుంటుంది. ప్రయాణాల సమయంలో మీరు పుదీనా నూనెని వాసన చూస్తే వాంతులు అవ్వకుండా ఉంటాయి.

లవంగాలు:

లవంగాలు కూడా వాంతులు అవ్వకుండా చూసుకుంటాయి. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక లవంగాన్ని తీసుకుంటే చక్కటి రిలీఫ్ వస్తుంది. ఇది వికారం, వాంతులు సమస్యని తగ్గిస్తుంది.

అల్లం:

అల్లం కూడా వాంతులు రాకుండా చూసుకుంటుంది. అల్లం టీ ని అయినా తీసుకోవచ్చు లేదు అంటే చిన్న అల్లం ముక్క నైనా తీసుకోవచ్చు.

నిమ్మ:

నిమ్మ వాంతులు అవ్వకుండా చూసుకుంటుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వికారం రాకుండా చూసుకుంటుంది. వేడి నీళ్ళలో నిమ్మకాయ రసం వేసి కొంచెం సాల్ట్ వేసి తీసుకుంటే వికారం వాంతులు సమస్య ఉండదు. లేదు అంటే మీరు నిమ్మకాయ అయినా తినొచ్చు.

యాలుకలు:

యాలుకులు కూడా వికారం రాకుండా చూసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ చిట్కాలను పాటించి ప్రయాణం సమయంలో ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news