ఉత్తరాఖండ్ లో బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ లో చేరిన బీజేపీ బహిష్కృత మంత్రి.

-

5 రాష్ట్రాల ఎన్నికలకు మరికొన్ని రోజలే సమయం ఉంది. ఈ లోపే పలు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే యూపీలో బీజేపీ పార్టీకి భారీ షాక్ లు తగిలాయి. ముగ్గురు మంత్రులు యోగీ ఆదిత్యనాథ్ క్యాబినెట్ కు, బీజేపీ పార్టీకి రాజీనమా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరితో పలువురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎస్పీ పార్టీలో చేరారు.

ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి లుకలుకలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ ను బీజేపీ మంత్రి వర్గం నుంచి బహిష్కరించింది. దీంతో పాటు ఆయనను 6 ఏళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ‘ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, నేను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాను’ అని ఉత్తరాఖండ్ బీజేపీ బహిష్కరణ మంత్రి హరక్ సింగ్ రావా బీజేపీకి సవాల్ చేశారు.

ఇదిలా ఉంటే తన కుటుంబానికి టికెట్లు ఇవ్వాలని మంత్రి హరక్ సింగ్ రావత్ పార్టీపై ఒత్తడి చేశారని…అయితే బీజేపీ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news