గర్భిణీలు ఈ పండ్లు తింటే ఇబ్బందులు వస్తాయి..!

-

సహజంగా గర్భిణీ స్త్రీలకు ఎన్నో నియమాలు ఉంటాయి. వారు తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అయితే తినకూడని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన తల్లికి మరియు బిడ్డకు కూడా అస్సలు మంచిది కాదు. అజాగ్రత్తగా ఉండడం వలన ఎంతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకుంటారో ఆమె ఆరోగ్యం పై మరియు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుంది.

 

చాలా శాతం మంది ఎలాంటి అవగాహన లేకుండా ఎన్నో రకాల ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకుంటూ ఉంటారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటిలో మొదటిగా పైనాపిల్ ఒకటి. గర్భిణీ స్త్రీలు పైనాపిల్ ను తినడం వలన ఎంతో హాని జరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే బ్రోమేలైన్ ప్రెగ్నెన్సీ సమయంలో హానికరంగా మారుతుంది. సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో పుల్లగా ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో పుల్లగా ఉండే చింతకాయలను కూడా తీసుకుంటారు. కానీ ఆరోగ్యానికి వీటి వలన చాలా ప్రమాదం ఉంది.

ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో చింతకాయలను తక్కువగా తీసుకోవాలి. చింతకాయలు ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించుతాయి. దీనివలన ఆరోగ్యం పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి లేక బొప్పాయి పండును కూడా తీసుకోకూడదు. పచ్చి బొప్పాయి తినడం వలన తల్లి, బిడ్డల ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. వీటిలో ఉండే లేటెక్స్ పిండానికి ఎంతో ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో నల్ల ద్రాక్షలు కూడా తీసుకోకూడదు. వీటిలో ఉండే రెస్వరాట్రాల్ గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మంచిది కాదు. అందువలన వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version